Advertisementt

రవిబాబు పందిపిల్ల పళ్ళుతోముతున్నాడు!

Thu 31st May 2018 03:33 PM
ravi babu,adhugo movie,video,social media  రవిబాబు పందిపిల్ల పళ్ళుతోముతున్నాడు!
Ravi Babu Adhugo Ready to Starts Shooting రవిబాబు పందిపిల్ల పళ్ళుతోముతున్నాడు!
Advertisement
Ads by CJ

కుక్కలు, గుర్రాలు, ఏనుగులు, పులుల కథలతోనే కాదు ఎలుకలు, ఈగలతో కూడా వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కొత్తదనంతో అలరించి ఘనవిజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇక విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు పందిపిల్లను ప్రధాన పాత్రలో తీసుకుని 'అదిగో' అనే చిత్రం తీశాడు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి ఎంతో కాలం అయింది. రవిబాబు ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం పందిపిల్లను చేతిలో పట్టుకుని ముద్దాడుతూ ఏటీఎం సెంటర్ల వద్ద, ఓట్లు వేసే సందర్భంగా కూడా పందిపిల్లతో కనిపించాడు. ఇక ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. 

ఇక తాజాగా దర్శకనిర్మాత రవిబాబు ఈ తెల్లని పందిపిల్లని బుజ్జగిస్తూ, దాని పళ్లు తోముతున్న వీడియోను విడుదల చేశాడు. దీనిని రవిబాబు తండ్రి నటుడు చలపతిరావు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. మీ ఆశీర్వాదాలు ఈ చిత్రానికి ఉంటాయి. ప్రతి సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టే బాగా ఆడుతున్నాయి. ప్రేక్షక దేవుళ్లకు మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్‌ చేయండి.. అని చలపతిరావు విజ్ఞప్తి చేశాడు. ఇక విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ నవ్విస్తూనే నవరసాలను పండించే రవిబాబు తీసిన ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సివుంది. 

ఒకప్పటి కంటే ఇప్పుడు విభిన్న చిత్రాల ఆదరణ బాగా ఉన్న నేపధ్యంలో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. మరోవైపు గబ్బిలాలు. పందుల వల్ల నిపా వైరస్‌ వస్తోందని దేశమొత్తం టెన్షన్‌ పడుతున్న నేపధ్యంలో రవిబాబు భలేగా ప్రమోషన్‌ చేస్తూ, పైసా ఖర్చు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని చెప్పవచ్చు. 

Ravi Babu Adhugo Ready to Starts Shooting:

Ravi Babu Adhugo Video Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ