Advertisementt

బిగ్‌బాస్‌ సీజన్ 2 ముహూర్తం ఫిక్స్!

Thu 31st May 2018 02:09 PM
hero nani,bigg boss season 2,june 10,star maa  బిగ్‌బాస్‌ సీజన్ 2 ముహూర్తం ఫిక్స్!
Bigg Boss Season 2 Date Fixed బిగ్‌బాస్‌ సీజన్ 2 ముహూర్తం ఫిక్స్!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌ తెలుగు, తమిళ భాషలు దాదాపు అటు ఇటుగా ఒకేసారి ప్రారంభమయ్యాయి. మొదట కమల్‌హాసన్‌ హోస్ట్‌ చేసిన తమిళ బిగ్‌బాస్‌ స్టార్ట్‌కాగా, ఆ రేంజ్‌లో బిగ్‌బాస్‌ తెలుగుని ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయగలడా? అని మొదట్లో సందేహాలు వచ్చాయి. కానీ చివరకు వచ్చే సరికి కమల్‌ కంటే ఎన్టీఆరే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 1ని రక్తికట్టించాడని టీఆర్పీలను బట్టి తేలిపోయింది. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌2కి కూడా కమలే తమిళంలో హోస్ట్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోతో కమల్‌ మంచి ఆసిక్తినే రేపాడు అందరినీ దూసుకెళ్తూ ఎందుకు దూసుకుని వెళ్తున్నాడో తెలియకుండా చివరకు ఓ పాపని రక్షించడంతో మనం చేసే పనులే కాదు వాటి వెనుక కారణాలు కూడా చూడండి అనేలా ఫినిషింగ్‌టచ్‌ ఇచ్చాడు.

ఇక కమల్‌ రాజకీయ పార్టీని కూడా పెట్టిన నేపధ్యంలో బిగ్‌బాస్‌2, ఆ తర్వాత 'భారతీయుడు 2'లు మాత్రమే కమల్‌ కనిపించే చివరి షోలుగా కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఇక తెలుగుకి వస్తే రెండో సీజన్‌కే ఎన్టీఆర్‌ తన బిజీ షెడ్యూల్‌ రీత్యా తప్పుకోవడంతో నేచురల్‌ స్టార్‌ నాని ఎంటర్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా ఫిక్స్‌ చేశారు. జూన్‌ 10వ తేదీ.. 16 మంది పార్టిసిపెంట్స్‌.. 100రోజులు.. ఒక బిగ్‌ బాస్‌ హౌస్‌... బిగ్‌బాస్‌ 2' అని నాని ట్వీట్‌ చేశాడు. అంతేకాదు...ఏమైనా జగగవచ్చు..రెడీగా ఉండండని ఈల వేస్తూ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇక ఇందులో కాస్త మసాలా ఎక్కువగానే ఉంటుందని ఆల్‌రెడీ నాని ఎప్పుడో తెలిపాడు. దీనిని బట్టి సీజన్‌1 కంటే సీజన్‌2లో బాలీవుడ్‌కి తగ్గట్టుగా బాగా మాస్‌ మాసాలా అంశాలను పెంచే ఉంటారని క్లారిటీ వస్తోంది. 

ఇక పార్టిసిపెంట్స్‌ కూడా ఎవరో త్వరలో క్లారిటీ రానుంది. సో.. ఈ షోలో ప్రతి శని, ఆదివారాలు నాని తెరపై కనిపిస్తాడు. దాంతో ఇది రాత్రి 9గంటలకే ప్రసారం అవుతుంది. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం కేవలం పార్టిసిపెంట్స్‌ మాత్రమే కనిపిస్తారు. ఇవి ఆయా రోజుల్లో రాత్రి 9.30 నిమిషాలకు స్టార్‌మాలో ప్రసారం కానున్నాయి. సో.. బి రెడీ. 

Bigg Boss Season 2 Date Fixed:

Bigg Boss Telugu Season 2 Starts on June 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ