మెగాభిమానులు ఒకప్పుడు చిరంజీవిని అన్నా అని పిలిచేవారు. ఆ తర్వాత చిరు రాజకీయాలలోకి వెళ్లి దశాబ్దం పాటు నటనకు బ్రేక్ ఇచ్చిన తర్వాత తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ని అన్నా అనడం మొదలు పెట్టారు. ఇక నాటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్‌నే కాదు... ఏహీరోనైనా వారి అభిమానులు అన్నలుగానే భావిస్తారు. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన తన ఫ్యాన్స్‌కి అన్న ఎలా అయ్యాడో, ఆయనతో విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్ వదినగానే మిగిలిపోయింది. అయితే పవన్ అభిమానులు చూపే అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉంటుందంటే తమ అన్న నుంచి విడిపోయినా ఇప్పటికీ వదిన తమ అన్నకే సొంత మనేలా వారి అభిమానం వుంటుంది. దీనివల్ల చాలా సార్లు రేణుదేశాయ్‌కి తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఆమె తనకు ఓ తోడు కావాలి అని అంటే ఎవరైనా ఆమెని చేసుకుంటే నరికేస్తామని అంటారు. తమ వదిన జీవితాంతం ఇలానే ఉండి పోవాలని అంటారు. తమ అన్న మాత్రం రెండుమూడు ఇలా ఎంతమందితోనైనా సుఖంగా ఉండవచ్చు గానీ ఆమె పిల్లలు మాత్రం తండ్రి లేని వారిగా తోడు లేకుండా ఉండాలంటారు.
ఇక రేణుదేశాయ్ కూడా తనకు సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తనపై వ్యాఖ్యలు చేసే పవన్ అభిమానులకు, తన ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా పవన్ ప్రస్తావన తేవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తనలోని తల్లిని, మాతృత్వానికి అద్దం పడుతూ ఓ కవితను రాసింది. ఈ కవిత ఏమిటంటే....ఒక హృదయం...ఒక ఆత్మ...మీ కోసం ప్రాణాలు ఇస్తాను..మీ కోసం ప్రాణాలు తీస్తాను....నా పిల్లల కోసం ఓ తల్లి రాసిన చిన్నకవిత ఇది. నేను ఈ ఇద్దరి ఫొటోలను తీస్తూనే ఉంటాను.. అంటూ కవితను పోస్ట్ చేస్తూ అకిరా, ఆద్యలను ఉద్దేశించి ఈ కవితను రాస్తూ వారి ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ఇక మీ కోసం ప్రాణాలు ఇస్తాను అనేది బాగానే ఉన్నా అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఆమె ఎవరిని ఉద్దేశించి రాసింది? అనేది ఆసక్తికరం.
అంటే తన పిల్లల జోలికి వచ్చిన వారెవ్వరినైనా అవసరమైతే ప్రాణాలు తీస్తాననేది ఆ కవిత సారాంశంగా చెప్పవచ్చు. మొత్తానికి పవన్-రేణుల పిల్లలు పెద్ద అవుతున్నారు. అకిరా అయితే ఇప్పుడే పవన్‌ని మించిన వాడిలా తయారయ్యాడు. తన తల్లి సింగిల్ పేరెంట్ కాబట్టి తన ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కొడుకుగా అకీరానే చూస్తున్నాడట. మరి పవన్ ఆర్దికసాయం ఏమైనా చేస్తున్నాడా? లేదా? అనేది మాత్రం తెలియదు. ఈ విషయం గురించి గతంలో రేణు పవన్ తన పిల్లల కోసమని కేవలం ఓ ఇల్లు మాత్రమే ఇచ్చాడని చెప్పిన సంగతి తెలిసిందే.