ఆమె కేవలం రెండేళ్ల వయసులోనే ఎంతో బరువైన 'అంజలి' పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె 'జగదేకవీరుడు అతిలోకసుందరి'తో పాటు ఆమె డబుల్ యాక్షన్‌లో 'లక్ష్మీదుర్గ' వంటి చిత్రాలు వచ్చి అద్భుత విజయం సాధించాయి. ఇక ఈమె జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం చేసేటప్పుడు షూటింగ్ గ్యాప్‌లో చిరంజీవి, శ్రీదేవి ఆమెని బాగా ముద్దు చేసేవారట. ఇక ఈమె పెద్దయిన తర్వాత 'ఓయ్' చిత్రంలో నటించినా ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ కాలేదు.
ఇక తాజాగా ఫిలింఫేర్ అవార్డులలో ఆమె చిరంజీవిని కలుసుకుని తనను తాను పరిచయం చేసుకుని నేనే షామిలిని అని చెప్పిందట. అంత చిన్న అమ్మాయి ఇంతలోనే ఇంత పెద్దదై పోయిందా అని చిరు ఎగ్జైట్ అయ్యాడట. అయినా చిన్ననాడు నటించిన షామిలి విషయంలో చిరు ఎగ్జైట్ అయినా ఈ భామ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. తాజాగా ఆమె నటించిన 'అమ్మమ్మగారిల్లు' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.