సినిమా ఫీల్డ్‌లో అన్నలు, అక్కలు ఫేమస్ అయిన తర్వాత తమ తమ్ముళ్లను, చెల్లెళ్లను ఫీల్డ్‌కి పరిచయం చేయడం ఎప్పటినుంచో వస్తూ ఉన్నదే. షావుకారు జానకి, కృష్ణకుమారి నుంచి రాధిక, నగ్మా, కాజల్ , ఆర్తి అగర్వాల్ వంటి ఎందరో ఈ కోవకి చెందుతారు. ఇక రవితేజ, శ్రీకాంత్, చిరంజీవి వంటి వారు సోదరులు కూడా సినీ రంగ ప్రవేశం చేశారు. వీరిలో కొందరు తప్పితే మిగిలిన వారందరు ఫ్లాప్ అయ్యారు.
ఇక 'ఎవడేసుబ్రహ్మణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' చిత్రాలలో నటించిన 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'తో సంచలనం సృష్టించిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. సాధారణంగా హీరోలకు పది పదిహేను మంచి చిత్రాలలో నటిస్తే గానీ రాని ఫాలోయింగ్ విజయ్‌దేవరకొండకు అర్జున్‌రెడ్డితో ఓవర్‌నైట్ వచ్చేసింది. ఇక ఈయన చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో 'ట్యాక్సీవాలా' చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా త్వరలో హీరోగా పరిచయం కానున్నాడట. ఈయన ఇప్పటికే నటనతోపాటు దానికి సంబంధించిన పలు అంశాలలో శిక్షణ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిట్నెస్‌పై ఈయన దృష్టి సారించాడు. విజయ్ దేవరకొండకి ముఖ్యుడైన ఓ నిర్మాణ సంస్థ విజయ్ తమ్ముడు ఆనంద్‌ని హీరోగా పరిచయం చేయనుందని సమాచారం.