ప్రస్తుతం 'బాహుబలి' తర్వాత భారీ బడ్జెట్‌తో యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇటీవల అబుదాబిలో షెడ్యూల్ పూర్తి చేసి ఇండియా వచ్చిన యూనిట్ త్వరలో తమ తదుపరి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం అబుదాబిలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక ఇందులో ప్రముఖ మలయాళ నటుడు లాల్ ఓ పాజిటివ్ అండ్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషిస్తున్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ, 'సాహో' చిత్రంలో నన్ను నటించమని అడగ్గానే నేను కథను గానీ నా పాత్రను గానీ అడగలేదు. దానికి కారణం ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని చెప్పగానే ఓకే చెప్పాను. దానికి కారణం ప్రభాస్ అంటే నాకున్న ఇష్టం, అభిమానం. నేనెంతో అభిమానించే ప్రభాస్ నటిస్తున్నాడని చెప్పగానే రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. ప్రభాస్‌పై నాకున్న అభిమానానికి, నమ్మకానికి ఇదే ఉదాహరణ.
ఇక ఈ సినిమా కథ గురించి యూనిట్‌లోని ఎవ్వరికీ అసలు తెలపకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా పాత్ర ఏమిటో కూడా మీకు చెప్పలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు..!