Advertisementt

గవర్నర్‌ దంపతులకు 'మహానటి' పిలుపు!

Wed 30th May 2018 07:27 PM
mahanati,governor,special show  గవర్నర్‌ దంపతులకు 'మహానటి' పిలుపు!
Mahanati Special Invitation to Governor గవర్నర్‌ దంపతులకు 'మహానటి' పిలుపు!
Advertisement
Ads by CJ

సావిత్రి బయోపిక్‌గా రూపొందిన 'మహానటి' చిత్రాన్ని విడుదలైన రోజే కేటీఆర్‌ చూసి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వెంటనే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్‌ ఆ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖుల నుంచి కూడా వరుసగా ప్రశంసల పర్వం కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, అల్లుఅరవింద్‌ వంటి వారు ఈ యూనిట్‌ని ఆహ్వానించి మరీ వారికి సన్మానం చేసి అభినందించారు. 

ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఈ యూనిట్‌ని ఆహ్వానించి దీనికి పన్ను మినహాయింపు ఇస్తానని చెప్పి చిత్ర యూనిట్‌ని, నటీనటులను, నిర్మాతలను సన్మానించారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు అశ్వనీదత్‌, ప్రియాంకాదత్‌లు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను ప్రత్యేకంగా కలిసి వారికి చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేశారు. 

ఈ సందర్భంగా వీరు గవర్నర్‌ దంపతులను ఈ చిత్రం చూసేందుకు ఆహ్వానించారు. దానికి గవర్నర్‌ దంపతులు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో నరసింహన్‌ దంపతులకు ఈ చిత్రం స్పెషల్‌ షోను ప్రదర్శించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 

Mahanati Special Invitation to Governor:

Mahanati Movie Director Ashwin Nag Producers Ashwini Dutt & Priyanka Dutt Met Governor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ