Advertisementt

'కాలా'కి కావాలనే ఇలా చేశారా?

Wed 30th May 2018 06:38 PM
rajinikanth,kaala,craze,dhanush  'కాలా'కి కావాలనే ఇలా చేశారా?
No Craze on Rajinikanth Kaala 'కాలా'కి కావాలనే ఇలా చేశారా?
Advertisement
Ads by CJ

రజినీకాంత్ గత చిత్రం 'కబాలి' రిలీజ్ కు ముందు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ట్రైలర్ లో రజిని చెప్పే పవర్ఫుల్ డైలాగ్.. రజిని ఓల్డ్ లుక్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కానీ సినిమా మాత్రం రజిని ఫ్యాన్స్ ని నిరాశపరిచిందనే చెప్పాలి. ఓపెనింగ్స్ తో తమిళనాట రికార్డులు నెలకొల్పినా సినిమా మాత్రం రజిని ఫ్యాన్స్ కి ఫేవరెట్ కాలేకపోయింది.

అయినా కానీ రజిని అండ్ ధనుష్ మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తున్నారు. తమిళ్ లో 'కరికాలన్‌' పేరిట రూపొందిన ఈ చిత్రాన్ని 'కాలా'గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రం ఇండియా వైడ్ జూన్ 7 న రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఈ సినిమాపై ఎటువంటి బజ్ లేదు. రిలీజ్ పలుమార్లు వాయిదా పడడం..కబాలి సినిమాపై అంచనాలు పెట్టుకుంటే డైరెక్టర్ రంజిత్‌ నిరాశ పరచడం వల్ల ఈ సినిమాపై హైప్ లేదు.

కానీ ధనుష్..రజినిలు మరోసారి రంజిత్‌కే అవకాశం ఇవ్వడం అనే పాయింట్స్‌ని బట్టి దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చు. ట్రైలర్స్ కూడా ఈసారి రజనీ మార్కు మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డారనే సంగతి తెలియజేస్తున్నాయి. ఇలా తక్కువ హైప్ తో వస్తున్న ఈ చిత్రం ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. 

No Craze on Rajinikanth Kaala:

Dhanush Special Care on Kaala Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ