Advertisementt

ఈసారి సంక్రాంతి పుంజులు ఇవేనా..?

Wed 30th May 2018 02:18 PM
  ఈసారి సంక్రాంతి పుంజులు ఇవేనా..?
Chiranjeevi Vs Balakrishna for Sankranthi? ఈసారి సంక్రాంతి పుంజులు ఇవేనా..?
Advertisement
Ads by CJ

ఇంకా సంక్రాంతి పండగకి ఏడెనిమిది నెలలుంది. అప్పుడే సంక్రాతి బరిలో నిలిచే సినిమాల హడావిడి మొదలైపోయింది. ఎప్పుడూ సంక్రాంతికి సీనియర్ స్టార్స్, స్టార్ హీరోస్, చిన్న హీరోలు పోటీ పడుతూ సంక్రాంతి హీరోలనిపించుకోవాలని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కానీ చాలామంది స్టార్స్ సంక్రాంతి సెంటిమెంట్ గా భావిస్తారు కూడా. ప్రస్తుత 2018 సంక్రాంతి భారీ సినిమాల్తో చప్పగా ఉండగా.. 2019 సంక్రాంతి మాత్రం భారీ లెవల్లో సినిమాలు విడుదలతో ప్రేక్షకులకు అసలు సిసలైన సంక్రాంతి సమరానికి సిద్దమవుతుంది. ఈ వచ్చే సంక్రాంతి రసవత్తరంగా మారే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఏ ఏ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయంటే మాత్రం అప్పుడే చెప్పడం కష్టం.

అయితే ప్రస్తుతానికి బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని సంక్రాంతి రిలీజ్ అంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. మరి క్రిష్ అనుకున్న టైం కి సినిమాని పూర్తి చేసి సినిమాని విడుదల చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు. ఆల్రెడీ బాలయ్య - క్రిష్ లు కలిసి గౌతమీపుత్ర శాతకర్ణితో సంక్రాంతి స్టార్స్ అనిపించుకున్నారు కూడా. ఇక చిరంజీవి - రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ సై రా నరసింహారెడ్డి కూడా సంక్రాంతికే విడుదల అంటూ చెబుతూ వస్తున్నారు సైరా యూనిట్ వాళ్ళు. కానీ చిరు 'సైరా' సంక్రాంతికి విడుదలవుతుంది అంటే... కొద్దిగా కష్టమంటున్నారు. మరోపక్క ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయినట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా దీని షూటింగ్ మొత్తం అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారని కూడా అంటున్నారు.

ఇక ముచ్చటగా మూడోది వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' సినిమా కూడా సంక్రాంతి బరిలో వుంది అని ఫిలిం నగర్ టాక్. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గా తెరకెక్కుతున్న యాత్ర సినిమా షూటింగ్ అందులోని నటీనటులు వివరాలు తెలియవు గాని.. యాత్ర సినిమా కూడా సంక్రాంతికే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. ఇక మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న మహేష్ 25 మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మహేష్ - వంశీల మూవీ షూటింగ్ మొదలవ్వలేదు గాని.. సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందనే కాన్ఫిడెంట్ తో దిల్ రాజు అండ్ బ్యాచ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి చిరు సైరా తో, బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో, మమ్ముట్టి యాత్రతో, మహేష్ కొత్త సినిమాతో సంక్రాంతి బరిలో ఉంటే గనక.. ఆ పోరు మాములుగా ఉండదు.. రసవత్తరంగా ఉంటుంది.

Chiranjeevi Vs Balakrishna for Sankranthi?:

2019 Sankranthi Release Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ