Advertisementt

'కాలా' ట్రైలర్: రజినీ సినిమాయేనా!

Wed 30th May 2018 12:56 PM
  'కాలా' ట్రైలర్: రజినీ సినిమాయేనా!
Kaala Trailer Released 'కాలా' ట్రైలర్: రజినీ సినిమాయేనా!
Advertisement
Ads by CJ

తలైవా రజనీకాంత్‌ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రానుంది. దానికి రిహార్సల్స్ గా 'కాలా' చిత్ర ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో 'కాలా' అంటే ఎవరు అని ఓ చిన్నారి అడగ్గా దానికి నానాపాటేకర్‌ 'రావణ్‌' అని సమాధానం ఇవ్వడం, రజనీ తన భార్యకి ఐ లవ్‌యు చెప్పే సీన్‌. దానికి ఆమె ఇచ్చే హావభావాలు, చివర్లో రజనీకాంత్‌ 'మన దేహమే ఒక ఆయుధం. ఇది ప్రపంచానికి తెలియాలి. ప్రజలారా కదలిరండి' అనే చెప్పే డైలాగ్‌కి బాగా ఉన్నాయి. డైలాగ్స్‌ని రజనీ పవర్‌ఫుల్‌గానే చెప్పినా డైలాగ్స్‌లో డెప్త్‌ మిస్సయినట్లు అనిపిస్తోంది. 

ఇక ముంబైలో వుండే తమిళవాసులు తరపున పోరాడే నాయకుడి పాత్రలో కాలా కనిపిస్తాడని ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతోంది. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన 15 నిమిషాల లోపే 1.3లక్షల వ్యూస్‌ని సాధించి, అందులో 18వేల లైక్స్‌ని కొల్లగొట్టింది. ఈ విధంగా చూసుకుంటే ఈ చిత్రం ఈ ట్రైలర్‌కి మంచి ఆదరణే లభించినట్లు అనిపించినా ఇది 'కబాలి'కి సీక్వెల్‌గా నాసిరకమైన క్వాలిటీ, ప్రొడక్షన్ తో ఉండటం నిరాశపరిచే అంశం. 

విలన్‌ సెట్‌ ధారావి స్లమ్‌ ఏరియా వంటి సెట్స్‌ తప్ప ఏమాత్రం ఆకట్టుకోని విధంగా నిర్మాణ విలువలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి కూడా 'కబాలి' ఫేమ్‌ రంజిత్‌పా దర్శకత్వం వహించగా, ధనుష్‌ వండర్‌బార్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జులై7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. కాలా భార్య పాత్రలో ఈశ్వరీరావు, బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి, విలన్ గా నానాపాటేకర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్‌ సంగీతాన్ని అందించారు. 

Click Here Kaala Trailer

Kaala Trailer Released:

Kaala Trailer Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ