Advertisementt

రాజమౌళి సినిమాలో చరణ్ పాత్ర ఇదేనట!

Tue 29th May 2018 04:00 PM
  రాజమౌళి సినిమాలో చరణ్ పాత్ర ఇదేనట!
Ram Charan Police Role in RRR Movie రాజమౌళి సినిమాలో చరణ్ పాత్ర ఇదేనట!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో హీరోలు, డైరెక్టర్స్ కాంబినేషన్ అంటే హైప్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలానే ప్రస్తుతం రాజమౌళి- రామ్ చరణ్ - ఎన్టీఆర్  కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో భారీ చర్చకు దారితీస్తుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే ఉండొచ్చని అర్ధం అవుతుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు నుండి ఈ సినిమాపై అనేక రూమర్లు వస్తున్నాయి.

ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రపై చాలా రూమర్లు వచ్చాయి. వాటిలో ఒకటి రామ్ చరణ్ ఇందులో ఒక పోలీస్ సీఐగా కనిపించబోతున్నారు అని. ఇప్పటికే రామ్ చరణ్ రెండు సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించాడు. ఒకటి 'ధృవ'లో, మరొకటి బాలీవుడ్ మూవీ 'తూఫాన్' లో. అయితే ఇందులో 'ధృవ' హిట్ కాగా 'తూఫాన్' బిగ్గెస్ట్ ప్లాప్ అయింది. మరొకసారి ఈ మల్టీ స్టారర్ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసు ఆఫీసరుగా రామ్ చరణ్  ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర పోషించడం గ్యారంటీ అంటున్నారు. 

మరి రామ్ చరణ్ పోలీస్ అయితే ఎన్టీఆర్  పాత్ర ఏమై ఉండొచ్చు అనే కొత్త ఊహ మొదలైంది. ఎన్టీఆర్ ఒక నాయకుడిగా గాని...ఒక డిటెక్టివ్ గా గాని కనిపించే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. ఒకవేళ ఎన్టీఆర్ ఇందులో డిటెక్టివ్ అయితే రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ తెరపై పవర్ఫుల్ గా ఉండే అవకాశం లేకపోలేదు.

Ram Charan Police Role in RRR Movie:

Ram Charan Role in RRR Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ