హిందీలో కంగనా రనౌత్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'క్వీన్' భారీ విజయం సాధించడంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతుంది. ఇప్పటికే తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే తెలుగులో మాత్రం మొదట అనుకున్న దర్శకుడు నీలకంఠ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. నీలకంఠ తప్పుకోవడంతో ఈ సినిమాను ఎవరు హాండెల్ చేస్తారో అనుకున్నప్పుడు మేకర్స్ కు ఓ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటది అని అలోచించి ‘అ’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న ప్రశాంత్ వర్మ ఈ రీమేక్ చేసే బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రశాంత్ వర్మ ఓ భారీ సినిమా చేసే పనిలో ఉన్నాడు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా టైం పట్టడంతో ఆయన కూడ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తమన్నా టైటిల్ రోల్ చేస్తుంది.