రామ్ చరణ్ ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు తండ్రి చాటు బిడ్డగానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఒక్క డాన్స్ తప్ప చరణ్ లో ఏ విధంగానూ హీరో అయ్యే లక్షణాలు లేవన్నారు. కానీ రెండో చిత్రానికే రాజమౌళి, మగధీర సినిమాతో చరణ్ లోని నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మగధీర తర్వాత చరణ్ చాలా సినిమాల కథలను ఎనలైజ్ చెయ్యకుండా ఒప్పేసుకుని బోర్లా పడ్డాడు. మగధీర తర్వాత తన రాంగ్ జెడ్జ్ మెంట్ వలన విజయాలను అందుకోలేకపోయారు. కానీ ధృవ సినిమా అప్పటి నుండి రామ్ చరణ్ మెచ్యూరిటీ లెవల్స్ అండ్ మైండ్ సెట్ కూడా మారింది. ధృవ సినిమా రీమేక్ చేయొద్దని చరణ్ ని చాలామంది వారించినా.. కథను నమ్మి సినిమా చేసి హిట్ కొట్టాడు.
అలాగే మేర్లపాక గాంధీ యువీ క్రియేషన్స్ ని మధ్యవర్తిగా పెట్టి కృష్ణార్జున యుద్ధం కథని ముందుగా రామ్ చరణ్ దగ్గరికే తీసుకెళ్లాడట. కానీ చరణ్ మాత్రం ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చెయ్యాలి.. నేను ద్విపాత్రాభినయం చేసిన నాయక్ ఫెయిల్ అయ్యింది. అందుకే ఇప్పట్లో అలా ద్విపాత్రాభినయం చెయ్యనని కృష్ణార్జున యుద్ధం కథని రిజెక్ట్ చేశాడట. ఇక నాని కూడా మాస్ అంటూ మేర్లపాక చెప్పిన దానికి పడిపోయి కృష్ణార్జున యుద్ధం చేసి చేతులు కాల్చుకున్నాడు. అలాగే చరణ్ దగ్గరకి రెండు హిట్స్ అందుకుని ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ కృష్ణ కూడా నేల టికెట్ కథని తీసుకురాగా.. చరణ్ దాన్ని కూడా రిజెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి రవితేజ ఆ సినిమా చేస్తే.. ఆ సినిమాని ప్రేక్షకులు ఎలా రిజెక్ట్ చేశారో చెప్పక్కర్లేదు.
ఇక రామ్ చరణ్ రంగస్థలం లాంటి ఒక పల్లెటూరి కథని ఎంచుకుని కూడా రిస్క్ చేశాడనే అన్నారు అందరూ. ఆ సినిమా విడుదలై హిట్ కొట్టేవరకు అందరికి డౌట్. సుకుమార్ కి కమర్షియల్ సినిమా తియ్యడం రాదని... అలాగే రంగస్థలంలో దివ్యంగుడిగా నటించడం కరెక్ట్ కాదన్నా.. ఎవ్వరి మాట వినకుండా చిట్టిబాబుగా అందరి మనసులను దోచేశాడు. మరి ఇలాంటి సమయంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలోనూ చాలా ఆచి తూచి వ్యవహరిస్తాడు అనేది తేలిపోయింది. కాకపోతే బోయపాటి సినిమాతోనే చరణ్ కి ఎమన్నా తేడా రావొచ్చంటున్నారు. ఎందుకంటే బోయపాటికి బాలయ్య సెట్ అయినట్లుగా మరే హీరో తన మాస్ గెటప్స్ కి సెట్ కారు. చూద్దాం రామ్ చరణ్ RC12 పరిస్థితి ఏమిటనేది.