సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాలలో ప్రత్యేకంగా ఓ పెద్ద స్టార్ హీరోయిన్‌ని తీసుకుని ఐటం సాంగ్స్ పెట్టడం ఉండదు. 'అజ్ఞాతవాసి'లో కూడా అలాంటి ప్రయత్నాన్ని త్రివిక్రమ్ చేయలేదు. ప్రత్యేక గీతం పెడతాడే గానీ దానిలో హీరోయిన్ లేకుండా చూసుకుంటాడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోని కొంపల్లిలో వేగంగా జరుగుతోంది. దసరా లేదా దీపావళిని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఓ ఐటం సాంగ్‌ని త్రివిక్రమ్ తీయాలని భావిస్తున్నాడు. సాధారణంగా ఎన్టీఆర్ చిత్రాలలో మిగిలిన పాటల కంటే ఐటం సాంగ్స్‌లోనే స్టెప్స్‌ని ఆయన ఇరగదీస్తాడు. 'జనతాగ్యారేజ్'లో కాజల్ 'నేను లోకల్' అంటూ ఏ స్థాయిలో రచ్చ చేసిందో తెలిసిందే.
ఇక 'జైలవకుశ'లో కూడా తమన్నా స్వింగ్ జరా అంటూ ఆడిపాడింది. ఇక తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రంలో ఓ ఐటం సాంగ్ కోసం మిత్రవింద కాజల్‌ని తీసుకున్నారట. దీనికోసం నిర్మాత రాధాకృష్ణ కూడా బాగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడని సమాచారం. ఇక ఈ చిత్రం త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో పాటు ఎన్టీఆర్‌లోని పవర్‌ఫుల్ యాంగిల్‌ని కూడా చూపించనున్నాడని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ అటు మాస్, ఇటు క్లాస్ లుక్స్‌తో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనున్నాడు. త్రివిక్రమ్ శైలిలో పంచ్ డైలాగ్‌లతో పాటు 'అజ్ఞాతవాసి' విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేలా త్రివిక్రమ్ దీనిని ఓ చాలెంజ్‌గా తీసుకుని తీస్తున్నాడు.
ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ లుక్, క్లాసీ, మాస్ లుక్‌లు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక టైటిల్ చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇందులో పూజాహెగ్డే ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈషారెబ్బా సెకండ్ హీరోయిన్ పాత్రను చేయనుందని వార్తలు వస్తున్నాయి.