పెళ్లి అయిన తర్వాత కూడా అన్నితరహా పాత్రలు చేస్తూ, గ్లామర్‌షో చేసే పాత్రలు కూడా చేయడం బాలీవుడ్‌లో అలవాటే. ఐశ్వర్యారాయ్ నుంచి కరీనాకపూర్ వరకు ఈ లిస్ట్‌లో పలువురిని చెప్పుకోవచ్చు. ఇక కోలీవుడ్‌లో కూడా అమలాపాల్‌తో పాటు పలువురు ఇదే నైజం ప్రకటిస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే పెళ్లయినా స్టార్ స్టేటస్ అనుభవించిన వారు పాతతరంలో చాలా మందే ఉన్నారు. పెళ్లి అయిన తర్వాతే వారు స్టార్స్‌గా మారారు. మరలా ఇంత కాలానికి సమంత అదే పని చేసి నిరూపిస్తోంది. ఈమె ఆ మద్య బీచ్‌లో బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
దాని గురించి సమంత మాట్లాడుతూ, బీచ్‌లో అలాంటి బికినీలతో ఫొటోలు విడుదల చేస్తే విమర్శలు వస్తాయని నాకు తెలుసు. అయితే బీచ్‌లో చీరలు కట్టుకోవాలా? నాకు వివాహం అయింది. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని కొందరు సలహాలు ఇస్తున్నారు. నా జీవితాన్ని ఎలా గడపాలి? ఎలా ఉండాలన్నది నాకు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. నేనెవ్వరికీ భయపడను. అలాగని సమస్యలలో చిక్కుకోవాలని భావించను. నా భర్త నాగచైతన్యతో కొన్నిసార్లు గొడవ పడుతూ ఉంటాను. మా మద్య గొడవ ఉన్నట్లు పక్కవారికి కూడా తెలియదు. నిశ్శబ్దంగా గొడవ పడుతున్న మమ్మల్ని చూస్తే ఎవరైనా సరే ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నామని అనుకుంటారు అని చెప్పుకొచ్చింది.
ఇక ఈమెది ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయ్ రాజా టైప్ మనస్తత్వం అని అర్దమవుతోంది. తాజాగా ఆమె ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఎంతో హాట్‌గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టగా భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరైతే ఏమండీ సమంత గారు ఇంత హాట్‌గా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇక్కడ సమంత పెళ్లయినా మారాలనేది విషయం కాదు. బీచ్‌లో ఆమె బికినీ వేయడంలో తప్పులేదు. కానీ వాటిని ఫొటోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాస్త అక్కినేని అభిమానులను ఇబ్బందులు పెడుతోంది.