Advertisementt

'వీరరాఘవ'లో ఎన్టీఆర్ పాత్రేమీ లేదంట!

Sat 26th May 2018 08:21 PM
aravinda sametha,trivikram srinivas,jr ntr,title,veera raghava  'వీరరాఘవ'లో ఎన్టీఆర్ పాత్రేమీ లేదంట!
NTR Clarity on Aravinda Sametha Title 'వీరరాఘవ'లో ఎన్టీఆర్ పాత్రేమీ లేదంట!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వకుండా ఈ సినిమాలో చాలానే జాగ్రత్తలు తీసుకుని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా ఈ టైటిల్ పై ఫిలింనగర్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాకు 'అరవింద సమేత' అనే టైటిల్ మాత్రమే పెడదాం అనుకున్నాడు. కానీ టైటిల్ కింద తన పాత్ర పేరైన 'వీరరాఘవ' ఉంచమని ఎన్టీఆర్ పట్టుబట్టాడనేది ఆ వార్త సారాంశం. అలా చేయకపోతే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనుకునే అవకాశం ఉందని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి చెప్పడంతో  'అరవింద సమేత వీర రాఘవ' అని పెట్టారట.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త హల్ చల్ అవుతుంది. అయితే టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యమే చేసుకోలేదనేది త్రివిక్రమ్ సన్నిహితుల మాట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బ కూడా  హీరోయిన్ గా నటించనుంది.

NTR Clarity on Aravinda Sametha Title:

Aravinda Sametha is Trivikram Mark Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ