జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తున్నారు. ఒకవైపు మండే ఎండల్లో ఈయన కవాత్తులు నిర్వహిస్తున్నాడు. ఇక విషయానికి వస్తే రామ్‌చరణ్ తాజాగా బోయపాటి శ్రీను చిత్రం షూడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సంద్భరంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటనలో బాబాయ్ కష్టపడుతూ ఉంటే బాధగా ఉంది. అయితే ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎంతగా బాధపడుతున్నారన్న విషయాన్ని బాబాయ్ గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన యాత్ర చేస్తున్నారు.
కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు. ఒకవేళ ప్రచారానికి రమ్మని బాబాయ్ పిలస్తే వెళతాను. ఆయనేమి అడిగినా చేస్తాను.. ప్రచారం చేస్తానని నాకైతే నేనేమి ఇప్పుడు అడగలేదు... అని చెప్పుకొచ్చాడు. అయినా రాజకీయాలంటే పవన్‌కి ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, నేడు జగన్ వంటి వారు ఎండనక వాననక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారంటే అదేమంత సులభమైన విషయం కాదు.
రాజకీయాలలో ఎండనక వాననక తిరిగి చేసే పాదయాత్రలలో ఎంతో కష్టం ఉంటుంది. ఇంత కాలం బయటి నుంచి చూసిన పవన్‌కి అది అంత ఈజీ కాదని అర్ధమై ఉంటుంది. అందుకే మూడు నాలుగు రోజుల గ్యాప్‌లోనే ఆయన ఎండల వేడిమికి తట్టుకోలేక రెండు రోజులు రెస్ట్ ప్రకటించాడని సెటైర్లు వినిపిస్తున్నాయి.