నాగ్‌అశ్విన్ ఏ ముహూర్తాన 'మహానటి' తీశాడో గానీ ప్రస్తుతం అందరు సావిత్రి గురించే మాట్లాడుతున్నారు. ఇక జెమిని గణేషన్‌కి సన్నిహితుడు, ముఖ్యమైన సన్నిహిత నటునిగా పేరున్ననిన్నటితరం నటుడు రాజేష్ తమిళంలో 'మహానటి' వర్షన్ అయిన 'నడిగైయార్‌తిలగం' చూసి స్పందించాడు. జెమిని గణేషన్ లైఫ్‌స్టైల్, ఆయన ఆలోచన విధానం నుంచి అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సావిత్రి ఆయనకు ఆల్‌రెడీ పెళ్లయిందని తెలిసి మరీ ఆయనను చేసుకోవడం ఆమె తప్పే. అందునా పిల్లలు ఉన్నారని తెలిసినా సావిత్రి ఆ పని చేయడం కరెక్ట్ కాదు.
సావిత్రికి ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తెలుసు. ఇక సావిత్రికి జెమిని మద్యాన్ని అలవాటు చేసి ఉండవచ్చు. కానీ దానికే బానిసై సర్వనాశనం కావడం సావిత్రి స్వీయ తప్పిదమే. సావిత్రి వ్యక్తిత్వానికి, జెమిని గణేషన్ మనస్తత్వానికి అసలు ఎక్కడా పొంతన ఉండదు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు.
ఇక కమల్‌హాసన్ మాట్లాడుతూ, సావిత్రిగారు నాకు బాలనటునిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆమె నన్ను దత్త పుత్రుడిలా చూసుకునేది. ఆమెకి ఇష్టమైన కిళ్లీ కట్టించుకురావడానికి ఇంపాలా కార్లు వెళ్లేవి. అదే సావిత్రి నాడు రోడ్డుపై నిలబడి ట్యాక్సీ కోసం వెయిట్ చేయడం కూడా చూశాను. ఇక సావిత్రి గారి బంగళా నాకు బాగా తెలుసు. అది ప్యాలెస్‌లా ఉండేది. నేను నిర్మాత అయిన తర్వాత ఆమెని చూడాలని కోరాను. నా మేనేజర్ ఆ బంగ్లా వద్దకు తీసుకెళ్లకుండా ఓ చిన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ సావిత్రి గారిని చూసి దు:ఖం ఆపుకోలేక ఏడ్చేశాను అని చెప్పాడు.