Advertisementt

సమంత ఎవ్వరికి సవాల్‌ విసురుతుందో!

Sat 26th May 2018 04:25 PM
akkineni akhil,fitness,challenge,samantha  సమంత ఎవ్వరికి సవాల్‌ విసురుతుందో!
Samantha Takes Challenge From Naga Chaitanya సమంత ఎవ్వరికి సవాల్‌ విసురుతుందో!
Advertisement
Ads by CJ

కొంతకాలం కిందట ఐస్‌బకెట్‌ చాలెంజ్‌ ఓ ఊపు ఊపింది. ఇటీవల నోస్ట్రా చాలెంజ్‌ కూడా బాగానే ఆదరణ పొందింది. కానీ తాజాగా ఒలింపిక్‌ పతకం  విజేత, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ హమ్‌ ఫిట్‌ అనే పేరుతో ప్రజలందరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సందేశంతో ఈ చాలెంజ్‌ విసిరాడు. ఆయన తాను పుషప్స్‌ తీస్తున్న వీడియోను తీసి ముగ్గురికి ఫిట్నెస్‌ చాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం సోషల్‌మీడియా మాధ్యమాలలో ఈ ఫిట్నెస్‌ చాలెంజ్‌ వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. రాథోడ్‌ చాలెంజ్‌ విసిరిన వారిలో హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ కూడా ఉంది. ఆమె ఈ చాలెంజ్‌ని స్వీకరించి మరో ముగ్గురికి చాలెంజ్‌ విసిరింది. వీరిలో పీవీ సింధు కూడా ఉంది. పీవీ సింధు చాలెంజ్‌ చేసిన వారిలో అక్కినేని అఖిల్‌ కూడా ఉన్నాడు. ఈ సవాల్‌ని స్వీకరించి తాను కసరత్తు చేస్తున్న వీడియోను అఖిల్‌ పోస్ట్‌ చేసి పలువురికి సవాల్‌ విసిరాడు. 

ఇందులో ఆయన సోదరుడు అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నాడు. దీంతో తాను జిమ్‌ చేస్తున్న 52 సెకన్ల వీడియోను నాగచైతన్య తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి, తన శ్రీమతి సమంత, హీరో శుశాంత్‌, నిధి అగర్వాల్‌లకి చాలెంజ్‌ విసిరాడు. మరి తన శ్రీవారి చాలెంజ్‌ని స్వీకరించి సమంత ఎవరికి చాలెంజ్‌ విసురుతుందో వేచిచూడాల్సివుంది...! 

Samantha Takes Challenge From Naga Chaitanya:

Fitness Challenge Between Sam and Chaitu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ