Advertisementt

రణవీర్, దీపికాలు లగ్గం కుదిరింది!

Sat 26th May 2018 01:27 PM
  రణవీర్, దీపికాలు లగ్గం కుదిరింది!
Ranveer and Deepika Wedding Date Fixed రణవీర్, దీపికాలు లగ్గం కుదిరింది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌ అంతా రణవీర్‌సింగ్‌, దీపికాపడుకోనేల మధ్య వివాహంపైనే చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల మాల్దీవుల్లో కూడా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ దీపికా పడుకోనే విషయంలో రణవీర్‌సింగ్‌ మౌనం పాటిస్తున్నాడు. ఏదైనా ఉంటే తానే బహిరంగంగా చెబుతానని హామీ ఇచ్చాడు. మరోవైపు దీపికా పడుకోనే కూడా రణవీర్‌సింగ్‌ వ్యవహారంపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఇక తాజాగా బాలీవుడ్‌ సమాచారం ప్రకారం నవంబర్‌ 19వ తేదీన ఈ జంట ఒకటవుతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి లేదు లేదు..ఉంటే మీకే చెబుతామని చెబుతూ వచ్చిన విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మలు గత ఏడాది డిసెంబర్‌లో ఒకటి అయ్యారు. 

ఇక ఈ ఏడాది ఆల్‌రెడీ అనిల్‌కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ వివాహం ఆనంద్‌ ఆహాజాతో జరిగింది. ఇక ఇదే నెలలో నేహాధూపియా, అంగద్‌బేడీల వివాహం కూడా జరిగింది. దీంతో ఈ ఏడాదే రణవీర్‌సింగ్‌, దీపికా పడుకోనేల వివాహం ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ఆల్‌రెడీ పెద్దలు కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, మరి వీరు ఇండియాలో ఒకటవుతారా? లేక డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటారా? అనేది వేచిచూడాల్సివుంది...! 

ప్రస్తుతం మాత్రం రణవీర్‌సింగ్‌, దీపికాపడుకోనేలు తమ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే అక్టోబర్‌ నుంచి రెండు మూడు నెలలు వీరు ఎవ్వరికీ కాల్షీట్స్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

Ranveer and Deepika Wedding Date Fixed:

Nov 19th Ranveer and Deepika Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ