Advertisementt

మళ్ళీ హీరోయిన్స్ కష్టాలు మొదలు!

Fri 25th May 2018 11:11 PM
raviteja,venkatesh,balakrishna,heroines,tollywood  మళ్ళీ హీరోయిన్స్ కష్టాలు మొదలు!
No Heroines for Star Heroes మళ్ళీ హీరోయిన్స్ కష్టాలు మొదలు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ ని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోస్ కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోస్ వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నుంచి అను ఇమ్మాన్యుయేల్ తప్పుకోవడంతో ఇలియానాను తీసుకుందాం అనుకున్నారు. అయితే ఇల్లి 2  కోట్లు డిమాండ్ చేసిందంట. ప్రొడ్యూసర్స్ కి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇల్లి అడిగిన మనీకి ఒకే చెప్పారని సమాచారం.

వాస్తవానికి ఇలియానాకు టాలీవుడ్ లో ఆఫర్లు ఎప్పుడో ఆగిపోయాయి. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరో పక్క వైఫ్ క్యారక్టర్స్.. లేదా ఓ మోస్తరు పాత్రలే తప్పించి కెరీర్ పీక్స్ లో ఎంజాయ్ చేసిన పాత్రలు అయితే కాదు. మరి ఇప్పుడు ఆమెకు అంత ఇచ్చి రవితేజ సినిమాలో తీసుకోవడానికి కారణం హీరోయిన్ కోసమే అమెరికా షెడ్యూల్ వాయిదా వేసే పరిస్థితి లేకపోవడం. 

మరోపక్క బాలకృష్ణ - వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రాన్ని నయనతారని తీసుకుందాం అనుకున్నారు కానీ ఆమెకు తెలుగులో 'సైరా'తో పాటు తమిళ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో చేసే ఛాన్స్ తక్కువే అని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి ఆ సెంటిమెంట్ పరంగా ఆమెను తీసుకుందాం అనుకున్నారు కానీ కుదరటం లేదు.

ఇక విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 లో తమన్నా కోసం ఇలియానా తరహాలోనే భారీగా ఆఫర్ చేశారని తెలిసింది. నాని - నాగార్జున మల్టీస్టార్రర్ లో కూడా నాగార్జున సరసన పెళ్ళైన ఆకాంక్ష సింగ్ ను తీసుకోవడానికి కారణం ఇదే. సో సీనియర్ హీరోలకు హీరోయిన్ ని సెట్ చేయటం కత్తి మీద సాములా మారింది.

No Heroines for Star Heroes:

Heroines Shortage in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ