యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌ని గురించి చెప్పాలంటే.. 'బాహుబలి'కి ముందు తర్వాత అని చెప్పాలి. 'బాహుబలి' మొదట్లో అనుకున్న సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే 'సాహో' చిత్రం రేంజ్ మొదట్లో అనుకున్నది వేరు.. ఇప్పుడు ఆ చిత్రం తీస్తున్న విధానం వేరు. ఏదో 40, 50కోట్లతో తీయాలని భావించిన సినిమా బడ్జెట్ ఇప్పుడు 200కోట్లకు పైగా ఎంత ఖర్చయినా ఫర్వాలేదనే స్థాయికి చేరింది. బహుశా 'బాహుబలి' తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రంగా 'సాహో'నే చెప్పుకోవాల్సి రావచ్చు. ఇక 'బాహుబలి' చిత్రానికి హిందీ వెర్షన్‌కి నిర్మాత అయిన కరణ్‌జోహార్ 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తో ఓ స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం తీయాలని ఆశపడ్డాడని, కానీ ప్రభాస్ నో చెప్పడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది.
ఇక 'సాహో' విషయానికి వస్తే అక్కడి షెడ్యూల్ ప్రస్తుతానికి పూర్తయింది. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఇక అక్కడ షూటింగ్‌కి అనుమతి లేదు. దాంతో ఇటీవలే 90లక్షలతో తీసిన ఛేజింగ్ సీన్స్‌ని ముగించుకుని ప్రభాస్ అండ్ టీం ఇండియా రానుంది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరో షెడ్యూల్ మొదలుపెడతారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ప్రభాస్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ, కరణ్‌తో చిత్రం చేయలేదని, తమ మధ్య విభేదాలు వచ్చాయనే మాట నిజం కాదని తేల్చేశాడు. ఇదే విషయం గురించి కరణ్‌జోహార్ తనకి ఫోన్ చేసి చెప్పడంతో ఇద్దరం నవ్వుకున్నామని చెప్పాడు. కానీ ఆయన బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ మీద మాత్రం సమాధానం దాటవేశాడు. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ. అదేమింటే కరణ్‌జోహర్ ప్రభాస్‌తో చిత్రం చేయాలని భావించిన మాట వాస్తవమే.
కానీ గతంలో చిరంజీవి, వెంకటేష్, రామ్‌చరణ్ వంటి వారి బాలీవుడ్ ఉదంతాలను చూసిన ప్రభాస్ ఆచితూచి అడుగు వేయాలనుకుంటున్నాడు. ఏదో హడావుడిగా ఏ చిత్రం అంటే దానిని ఒప్పుకోకుండా, సరైన కథ కోసం వెయిట్ చేయాలని, ఈలోపుగా బాలీవుడ్ వారికి ఎక్కువ చాన్స్ ఇస్తూ 'సాహో' టైప్‌లో తెలుగుతో పాటు బాలీవుడ్‌ని కలిపి చేయాలని మాత్రమే చేసి తన ఇమేజ్‌ని మరింతగా పెంచుకోవాలని, అప్పటి వరకు తెలుగు మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలనేది ప్రభాస్ ప్లాన్‌గా అర్ధమవుతోంది.