ఇటీవల రజనీకాంత్ మాట్లాడుతూ, తాను నటించిన 'కాలా' చిత్రంలో సీనియర్ హీరయిన్‌ని ఎంచుకోవడంపై బాగా స్పందించాడు. ఈ వయసులో 16ఏళ్ల అమ్మాయితో కలిసి స్టెప్పులు వేయలేను కదా...! అందుకే నా వయసుకు పాత్రకి తగ్గ వారని ఎంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఈయన నటిస్తున్న 'కాలా' చిత్రం జూన7వ తేదీన విడుదల కానుండగా, '2.ఓ' చిత్రం ఆగష్టులో లేదా దీపావళికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రజనీ పొలిటికల్‌గా కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇక ఆయన నటించే చివరి చిత్రంగా అందరు భావిస్తున్న చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ 'పిజ్జా' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఇందులో తలైవా సరసన నటించే అవకాశం అంజలి, త్రిష, మీనా వంటి వారికి ఉన్నాయని వార్తలు వచ్చాయి. చివరకు ఈ అద్భుతమైన అవకాశం సిమ్రాన్‌కి దక్కిందని సమాచారం. సిమ్రాన్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ అందరితో నటించింది. ఇక తెలుగు విషయానికి వస్తే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి మహేష్‌బాబు, హరికృష్ణ వంటి వారి సరసన కూడా నటించింది. ఇక ఈమె 2008లో తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఒక్కమగాడు', 'జాన్ ఆప్పారావు 40 ప్లస్' చిత్రాలలో నటించింది.
ఇక రజనీకాంత్ చిత్రం అంటే అది తెలుగులో కూడా విడుదల కావడం ఖాయం కాబట్టి ఇదే నిజమైతే సిమ్రాన్ పదేళ్ల తర్వాత తెలుగులో కనిపించే చిత్రం ఇదే కానుంది. తమిళంలో మాత్రం ఆమె పలు చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ వంటివి చేస్తూనే ఉంది.