Advertisementt

అల్లుశిరీష్‌ ది విలన్ పాత్ర కాదంట!

Fri 25th May 2018 10:06 PM
allu sirish,suriya,mohanlal,movie,villain role  అల్లుశిరీష్‌ ది విలన్ పాత్ర కాదంట!
Allu Sirish Not Villain in K V Anand Movie అల్లుశిరీష్‌ ది విలన్ పాత్ర కాదంట!
Advertisement
Ads by CJ

అల్లుశిరీష్‌.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో, తండ్రి ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌, అన్నయ్య స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌. కానీ హీరోగా అల్లు శిరీష్‌కి చెప్పుకోదగ్గ హిట్‌ మాత్రం లేదు. 'గౌరవం, కొత్త జంట' నుంచి తాజాగా వచ్చిన 'ఒక్క క్షణం' వరకు ఆయన ఖాతాలో అన్ని అపజయాలే. ఏదో 'శ్రీరస్తు...శుభమస్తు' మాత్రం దర్శకుడు పరుశురాం టాలెంట్‌తో ఓకే అనిపించుకుంది. ఇక ఈయన తన తండ్రి, అన్నయ్యల సిఫారసుతో మోహన్‌లాల్‌ మలయాళంలో నటించిన '1971- బియాండ్‌ ది బోర్డర్స్‌' చిత్రంలో ఓ పాత్ర చేశాడు. ఈ చిత్రం కూడా హిట్‌ కాలేదు. 

కానీ అల్లుశిరీష్‌ మరోసారి తమ కుటుంబానికి ఉన్న పలుకుబడి దృష్ట్య్యా మరో క్రేజ్‌ తమిళ చిత్రంలో అవకాశం వస్తోంది. ఇందులో స్టార్‌ సూర్యతో పాటు మోహన్‌లాల్‌ కూడా నటిస్తున్నాడు. 'రంగం' చిత్రంతో తన టాలెంట్‌ని నిరూపించుకున్న కెవి.ఆనంద్‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఇది సూర్యకి 37వ చిత్రం కావడం విశేషం. ఇక 'వీడొక్కడే-బ్రదర్స్‌' చిత్రాల తర్వాత కెవిఆనంద్‌, సూర్యల కాంబినేషన్‌లో వస్తున్న ఇది ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం కావడం విశేషం.

ఇక ఇందులో అల్లుశిరీష్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో అల్లుశిరీష్‌కి ఎంతో కీలకమైన పాత్రే గానీ నెగటివ్‌ పాత్ర కాదని వారు తేల్చేశారు. ఇక ఈ చిత్రంలో అల్లుశిరీష్‌ డిఫరెంట్‌ లుక్‌తోపాటు విభిన్నమైన పాత్రతో సర్‌ప్రైజ్‌ చేయనున్నాడట. ఇక ఈచిత్రంలో 'అఖిల్‌' ఫేమ్‌ సాయేషా సైగల్‌ పేరును హీరోయిన్‌ పాత్రకి పరిశీలిస్తున్నారు. 

Allu Sirish Not Villain in K V Anand Movie:

Allu Sirish in Suriya and Mohanlal Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ