ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ లోపు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ తమ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సెట్స్ మీదుంటే... రామ్ చరణ్, బోయపాటి సినిమాతో సెట్స్ మీదున్నాడు. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ పరిగెడుతుంటే.. చరణ్- బోయపాటిల సినిమా షూటింగ్ చప్పగా సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కూడా బయటికి వచ్చేసింది కానీ... చరణ్ అండ్ బోయపాటిల సినిమా విషయాలేమి అంటే.... చరణ్ లుక్ బోయపాటి సినిమాలో ఎలా వుండబోతుందో క్లారిటీ లేదు.
మరి ఎన్టీఆర్ రాజమౌళి సినిమా కోసం తన అరవింద సమేతని పరుగులు పెట్టిస్తూ మార్కెట్ లో క్రేజ్ కొట్టేస్తున్నాడు. కానీ చరణ్ మాత్రం సైలెంట్ గా చేసుకుపోతున్నాడు. కానీ చరణ్ - బోయపాటి లుక్ గాని, టైటిల్ గాని ఇంతవరకు అనుకోలేదు. అసలు మొన్నీ మధ్యన అనేక రకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా అటు చరణ్ కానీ, ఇటు బోయపాటి కానీ వాటిని ఖండించలేదు. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కొత్తగా కనబడుతున్నాడనేది ఫస్ట్ లుక్ లో రివీల్ అయ్యింది. మరి చరణ్ కూడా మాస్ గా ఏమన్నా ట్రై చేస్తున్నాడా? ఏమోకానీ జిమ్ లో మాత్రం హీరోయిన్ తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాకి దసరా టార్గెట్. దసరాకి ఈ సినిమాని కంప్లీట్ చేసి విడుదల చెయ్యాలని త్రివిక్రమ్, ఎన్టీఆర్ అనుకుంటున్నారు. అంటే రాజమౌళితో సినిమా టైంకి ఎన్టీఆర్ పూర్తిగా ఫ్రీ అవ్వాలనుకుంటున్నాడు. కానీ చరణ్ మాత్రం బోయపాటిని కూల్ గా షూటింగ్ చేసుకోమంటున్నాడు. అలాగే కావాల్సిన డేట్స్ ఇస్తానని కూడా చెబుతున్నాడు. రంగస్థలంతో వచ్చిన హిట్ ట్రాక్ ని బోయపాటి సినిమాతో కొనసాగించాలని చరణ్ కూల్ గా షూటింగ్ చేస్తూ సినిమా ఎప్పుడోకప్పుడు విడుదల చేసుకోవచ్చని భావిస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా మొదలైనా... బోయపాటి సినిమాని కూడా నెగ్లెట్ చెయ్యనని చెబుతున్నాడు. మరి ఎన్టీఆర్ అలా అన్నిటిలో ఓకె గా కనబడుతుంటే... చరణ్ మాత్రం ఏమి అర్ధం కాకుండా ఉన్నాడు.