'నా పేరు సూర్య' సినిమాకు ఇంకా టాటా చెప్పే టైం వచ్చేసిందని చెప్పాలి. మరో రెండు రోజుల్లో కొత్త సినిమాలు ఉండటంతో ఈ సినిమాను తీసేసే పరిస్థితి వచ్చింది. మెయిన్ సెంటర్స్ లో తప్ప దాదాపు అన్ని సెంటర్స్ లో ఈ సినిమాను ఎత్తేయనున్నారు. ఇకపోతే ఆడియో లాంచ్ నుండి సక్సెస్ మీట్ దాకా ఈ సినిమా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ప్రొమోషన్స్ లో ఎక్కడ కనిపించకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.
అంతా తన సినిమాలతో బిజీగా ఉన్నదనుకున్నారు కానీ కారణం వేరే ఉందంట. అను ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్న హీరోయిన్. సినిమాలకి తన డిమాండ్ పెరగడంతో పారితోషికం కూడా ఎక్కువ పెంచేసిందంట. కానీ 'నా పేరు సూర్య' ఇప్పుడు ఒప్పుకున్న సినిమా కాదు. ఏడాది క్రితమే సైన్ చేసింది. అప్పుడు అనుకున్న పారితోషికం కొంచెం ఎక్కువగానే డిమాండ్ చేసింది. సినిమా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్స్ కూడా ఏం ఆలోచించకుండా ఒకే అనేశారు. కానీ రిలీజ్ కి ముందు తన అమౌంట్ క్లియర్ చేస్తామని నిర్మాతలు అనడంతో అలిగి వాటికి దూరంగా ఉందని ఫిలిం నగర్ టాక్.
తీరా సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టడంతో మిగిలిన బాలన్స్ తర్వాత చూద్దాం అని నిర్మాతలు చెప్పినట్టు సమాచారం. మరి నిర్మాతలు పాపంలే అని ఆమె అడిగిన డబ్బులు ఇచ్చేస్తారా... లేక ప్రొమోషన్స్ కి రాలేదని సగం కట్ ఇస్తారా చూడాలి. అసలే సినిమా పోయిందని బాధల్లో ఉంటే మధ్యలో ఈ సెటిల్మెంట్ ఏంటో?