ఇంతకాలం మనం రా చిత్రాలంటే తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్‌లలోనే వస్తాయని అనుకునే వాళ్లం. కానీ 'అర్జున్‌రెడ్డి' ఇలాంటి వాటిని పటాపంచలు చేసింది. తెలుగులో కూడా ఇంటెన్సిటీ చూపిస్తే యూత్‌కి బాగా కనెక్ట్ కావచ్చని ఆ చిత్రం నిరూపించింది. ఇక విషయానికి వస్తే పోస్టర్స్‌తోనే ప్రేక్షులను ఆకర్షించి, ట్రైలర్ విడుదల తర్వాత అందరు తమ చిత్రం గురించే మాట్లాడేలా చేస్తున్న చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. ఈ చిత్రం దర్శకుడు అజయ్‌భూపతి, ఈయన గతంలో వర్మ వద్ద 'కిల్లింగ్ వీరప్పన్' వంటి చిత్రాలకు పనిచేశాడు. ఒకప్పుడు వర్మ అన్నా, వర్మ శిష్యులన్నా ప్రేక్షకుల్లో ఓ అంచనా వుండేవి. సరికొత్త పంధాలో చిత్రాలు ఉంటాయని ఆశించేవారు. కానీ వర్మకే ఇప్పుడు దిక్కులేదు. ఆయన తీసిన 'ఆఫీసర్'ని పట్టించుకునే వారు లేరు.
ఇక పూరీ, కృష్ణవంశీల పరిస్థితి కూడా అదే. అలాంటి సమయంలో అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న'ఆర్‌ఎక్స్ 100' చిత్రం ట్రైలర్ చూస్తుంటే కొన్ని షాట్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. తనదైన మార్క్‌ని, ఏదో కొత్తదనం ఉందనే ఆలోచనను దర్శకుడు కలిగించాడు. కొందరు మాత్రం ఈ ట్రైలర్‌లో 'అర్జున్‌రెడ్డి' ప్రభావం బాగా కనిపిస్తోందని కితాబునిస్తున్నారు. ఇక ఇందులో కార్తికేయ, పాయల్‌రాజ్‌పుత్‌లు జంటగా నటించగా ఈ చిత్రం గురించి రావు రమేష్ మాట్లాడుతూ, కథ లేకుండా ఎన్ని కష్టాలు పడినా అది బూడిదలో పోసిన పన్నీరే. కథని నమ్మి తీసిన చిత్రం ఈ 'ఆర్‌ఎక్స్ 100' ట్రైలర్ చూసిన వారందరు సినిమా హిట్టవుతుందని అంటున్నారు. రాంకీ గారు ఇందులో మంచి ఫాదర్ క్యారెక్టర్‌ని చేశారు. ఈచిత్రం ద్వారా తెలుగుకి మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు అని చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, ఈ చిత్రం ట్రైలర్‌ని కొందరికి చూపిస్తే, తమిళ, మలయాళ చిత్రంలా ఉందన్నారు. రా నేటివిటీ మూవీస్ వారికే సొంతమా? తెలుగులో మనం తీయలేమా? అనే కసితో సినిమా తీశాను. మన నేటివిటీని మనం పట్టుకోలేం. ఎందుకంటే తెలుగు సినిమాకి కొన్ని పరిధులున్నాయి. ఆ పరిధులను దాటి వెళ్లిన చిత్రం ఇది. ఇదో ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ 'ఆర్‌ఎక్స్ 100' ని చూస్తుంటే ఇదేదో మరో అర్జున్‌రెడ్డిలా ఉండటం ఖాయమనిపిస్తోంది. మరి ట్రైలర్‌తోనే సరిపుచ్చుతారా? లేక సినిమాలో కూడా దమ్ముంటుందా? అనేది వేచిచూడాల్సివుంది...!