Advertisementt

'అరవింద సమేత' లో రంభ లేనట్లే!

Thu 24th May 2018 04:31 PM
actress rambha,aravinda sametha,jr ntr,trivikram srinivas  'అరవింద సమేత' లో రంభ లేనట్లే!
Actress RamBha Rejected Aravinda Sametha 'అరవింద సమేత' లో రంభ లేనట్లే!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ అరవింద సమేత - వీర రాఘవ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. దసరాకి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్న దర్శకుడు హీరో కూడా షూటింగ్ కి చిన్న విరామం కూడా ఇవ్వడం లేదు. పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్ కోసం మరో తెలుగు హీరోయిన్ ని త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బ. అ!! సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఈషా పాత్ర ఎక్కువగా కనిపించే పాత్ర కాదని... చిన్న పాత్రే అయినా అది కీలక పాత్ర కావడంతోనే ఈషా ఈ అవకాశాన్ని ఒప్పుకుందని అంటున్నారు.

అయితే హీరోయిన్ పూజా హెగ్డే, ఈషా రెబ్బతో పాటుగా త్రివిక్రమ్ తన ఆనవాయితీ ప్రకారం ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ని తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అందులో మీనా, లయ పేర్లు మొదట్లో వినబడినప్పటికీ.. తాజాగా ఆ లిస్ట్ లోకి రంభ వచ్చి చేరింది. ఇక రంభతో త్రివిక్రమ్ ఇప్పటికే సంప్రదింపులు జరపడం.. రంభ ఒప్పుకోవడం జరిగిందని.. అతి త్వరలోనే రంభ, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లుగా కూడా అన్నారు. కానీ తాజాగా రంభ, త్రివిక్రమ్ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది.

కారణమేమిటంటే రంభ ప్రస్తుతం గర్భవతి  కావడంతో.. ఈ ప్రతిపాదన త్రివిక్రమ్ అండ్ టీమ్ ఉపసంహరించుకున్నారట. రంభకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే మొన్నామధ్యన రంభ తన భర్తతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కినా.. తర్వాత మళ్ళీ భర్తతో కలిసిపోయింది. ఇక ఇద్దరమ్మాయిలున్న రంభ  ఇప్పుడు మూడోసారి గర్భవతిగా ఉంది. అందుకే ఆమెను మూవీలోకి తీసుకునే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ కి కీలక పాత్రలిస్తుంటాడు. ఇక అరవింద సమేతలో కూడా రంభ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఇక ఇప్పుడు రంభ స్థానంలోకి మరో క్రేజున్న సీనియర్ హీరోయిన్ వేటలో అరవింద బృందం పడిందట.

Actress RamBha Rejected Aravinda Sametha:

No Rambha in Trivikram and JR NTR Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ