Advertisementt

చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. సిట్టింగ్ కు రెడీ!

Thu 24th May 2018 11:18 AM
jr ntr,ram charan,rajamouli,multistarrer  చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. సిట్టింగ్ కు రెడీ!
RRR Story Ready చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. సిట్టింగ్ కు రెడీ!
Advertisement
Ads by CJ

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, రామారావు అనే టైటిల్ అందరిలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. రాజమౌళి చేతిలో స్టార్ హీరోలు. మరి బాహుబలి లాంటి కళా ఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటేనే చెవి కోసేసుకుంటారు. మరి రాజమౌళి డైరెక్షన్ లో ఇద్దరు స్టార్ హీరోలంటే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనేది చెప్పడం కన్నా గత మూడు నెలలుగా చూస్తూనే ఉన్నాం. అయితే రాజమౌళి సినిమా మొదలయ్యేది మాత్రం అక్టోబర్ లోనే. కానీ ఇప్పటినుండే రాజమౌళి మల్టీస్టారర్ పై బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం RRR ల మధ్యన కథ చర్చలు కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్, చరణ్ లు స్వయంగా చెప్పారు.

అయితే రంగస్థలం హిట్ తో కొద్దిపాటి రెస్ట్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో RC12 లో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ లో పాల్గొంటూ జిమ్ లో బాడీని తగ్గిస్తూ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇక బోయపాటితో కలిసి బ్యాంకాక్ వెళ్లిన రామ్ చరణ్ అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చెయ్యనున్నాడు. విరామమే లేకుండా సాగిన బ్యాంకాక్ షూటింగ్ వలన అలిసిపోయిన రామ్ చరణ్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడట. అయితే ఈ రెస్ట్ సమయంలో రాజమౌళి తన పని కానిచ్చేయాలని చూస్తున్నాడట. రామ్ చరణ్ రెస్ట్ తీసుకునే సమయంలో తన కథా చర్చలు ఫినిష్ అవ్వాలని అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఇక ఎలాగూ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు. అందుకే ఎన్టీఆర్, చరణ్ లతో కలిసి స్టోరీ సిట్టింగ్స్ కి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి చరణ్ ని విశ్రాంతి తీసుకోనియ్యకుండా.... ఎన్టీఆర్ ని సాఫీగా షూటింగ్ చేసుకోనియ్యకుండా రాజమౌళి తన సినిమా కోసం చరణ్ అండ్ ఎన్టీఆర్ లను అడ్డంగా బుక్ చేస్తున్నాడా... అంటూ ఎన్టీఆర్ అండ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారట. ఇక ఎన్టీఆర్ - పూజా హెగ్డేలు - త్రివిక్రమ్ అరవింద సమేత తో బిజీగా ఉంటే.. చరణ్ - బోయపాటి - కైరా అద్వానీ లు RC12  తో బిజీగా వున్నారు. చూద్దాం రాజమౌళితో చరణ్ అండ్ ఎన్టీఆర్ ల RRR స్టోరీ సిట్టింగ్ ఎలా వుండబోతుందో అనేది. 

RRR Story Ready:

RRR Story Discussions Starts Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ