బాలీవుడ్‌లో స్పోర్ట్ పర్సన్స్ బయోపిక్‌లు 'భాగ్ మిల్కా భాగ్'తో ఊపందుకున్నాయి. తర్వాత వచ్చిన 'మేరికోమ్, ఎం.ఎస్.ధోని, సచిన్ టెండూల్కర్' వంటి బయోపిక్స్ ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ 'అజారుద్దీన్' బయోపిక్‌గా వచ్చిన 'అజర్'మాత్రం డిజాస్టర్ అయింది. ఇక వీటన్నింటిలో ధోనీ బయోపిక్ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. త్వరలో మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ రూపొందనుంది. అతను ఎవరో కాదు.. ది ప్రిన్స్ ఆఫ్ కోల్‌కత్తాగా కోల్‌కత్తా రాకుమారుడిగా, దాదాగా, కెప్టెన్‌గా, ఆటగానిగా కూడా భారత్ క్రికెట్ జట్టును విజయపధంలో నిలిపి, అగ్రెసివ్ కెప్టెన్సీకి అర్ధం చెప్పిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈయనను అందరు దాదా అనిపిలుస్తూ ఉంటారు.
ఇక గంగూలీ బయోపిక్ ఆధారంగా వచ్చిన పుస్తకం 'ఎ సెంచరీ నాట్ ఎనఫ్' అనే దాని ఆధారంగా బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థ అధినేత ఏక్తాకపూర్ ఈ బయోపిక్‌ని నిర్మించనున్నారు. దీనికి దాదాగిరి నెవర్ ఎండ్స్ అనే టైటిల్‌ని కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ బయోపిక్ సినిమాగా మాత్రం రావడం లేదు. వెబ్‌సిరీస్ రూపంలో ఇది రూపొందనుంది. దీనికి సంబంధించిన ఏక్తాకపూర్, సౌరవ్ గంగూలీల మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక సౌరవ్ గంగూలీ పాత్రను ఎవరు చేయనున్నారు? అనేది ఆసక్తిని కలిగించే విషయం.
తన కెరీర్ మొదట్లోనే ఆల్‌రౌండర్‌గా ఎంపికై వన్డేలలో విఫలమైన తర్వాత డ్రింక్స్ అందించే 12వ ఆటగాడిగా ఉండి. ఆ అవమానాన్ని తట్టుకోలేక రెండోసారి తనకు అవకాశం వచ్చిన తర్వాత మొదటి టెస్ట్‌లో అందునా లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన గంగూలీ క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, నగ్మాతో ఎఫైర్ వంటి ఎన్నో మాస్ మసాల అంశాలు ఉన్నాయి. మరి దీనిని ఎంత అద్భుతంగా తీస్తారనేది ఏక్తాకపూర్‌కి చాలెంజ్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు.