సినిమారంగంలోని వారు ఏమి ధరించారు? ఎలా కనిపించారు? వారు వేసుకునే డ్రస్ ఎలా ఉంది? ఇలా ప్రతి కదలిక కూడా జనాలకు ఎంతో ఆసక్తిని రేకెత్తించే విషయాలే. ఆతర్వాత రాజకీయ నాయకులు, బిజినెస్‌మేన్‌ల వంటి వారు వస్తారు. మోదీ వేసుకున్న సూట్ విలువ నాడు పెద్ద సంచలనంగా మారింది. ఇక అంబానీల ఇంటి నుంచి వారు వాడే సెల్‌ఫోన్ వరకు వార్తల్లో నిలిచాయి. తాజాగా బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్న ప్రియాంకా చోప్రా కూడా ఈ విషయంలో దీపికాపడుకొనేను దాటి ముందుకు వెళ్తోంది.
తాజాగా ఆమె బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్‌ల వివాహానికి ఆమె ధరించి వచ్చిన చెప్పుల విలువ 1.34లక్షలు అని తెలిసి అందరు అవాక్కవుతున్నారు. డ్రస్‌లకు ఇంత ఖర్చుపెట్టడం చూశామే గానీ కాలి కింద ఉండే చెప్పులు ఇంత ధర పెరగడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. తల నుంచి చెప్పుల వరకు ఆమె అలంకరించిన వస్తువులు అద్భుతమని ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. తమ డ్రీమ్‌గర్ల్‌ని అలా చూస్తుంటే చూస్తూనే ఉండాలని అనిపించేలా ఉందని వారు మురిసిపోతున్నారు.
ఇక ఈ చెప్పులను ఆమె ప్రత్యేకంగా స్వరోక్సి క్రిస్టల్‌తో డిజైన్ చేయించింది. అమెరికా నటి మేఘన్ ప్రియాంకా చోప్రాకు ఎంతో సన్నిహితురాలు. తన స్నేహితురాలి జీవితం ఈ పెళ్లితో మారిపోతుందని, ఆమె చాలా తెలివైన నటి అని ప్రియాంకా ఈ సందర్భంగా మేఘన్‌ని ఆకాశానికి ఎత్తింది. ఈ పెళ్లికి ఎందరో అతిరథ మహారధులు వచ్చారు. ఈ పెళ్లి వేడుకను ప్రపంచ వ్యాప్తంగా పలు చానెల్స్ లైవ్ టెలికాస్ట్ చేశాయి. మరి ఇంతకీ ప్రియాంకా పెళ్లి ఎప్పుడోనని అందరి చూపు ఆమెపైనే నిలవడం విశేషం.