Advertisementt

ఐపిఎల్‌లో చిట్టి సందడి..!

Wed 23rd May 2018 03:40 PM
  ఐపిఎల్‌లో చిట్టి సందడి..!
2.0 Teaser Ready to Release ఐపిఎల్‌లో చిట్టి సందడి..!
Advertisement
Ads by CJ

గణేశుని పెళ్లికి ఎన్ని విఘ్నాలు వస్తాయో... కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో '2.ఓ' చిత్రం విషయంలో కూడా అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీని తర్వాత ఎంతో ఆలస్యంగా ప్రారంభమైన రజనీ మరో చిత్రం 'కాలా' కూడా వచ్చే నెల 7వ తేదీన విడుదల కానుంది. కానీ '2.ఓ' చిత్రం విషయంలో శంకర్‌ మెట్టు దిగడం లేదు. తనకు సంతృప్తి కలిగించనిదే విడుదల డేట్‌ కూడా ప్రకటించడానికి ఆయన సుముఖంగా లేడు. మరీ ఎంత భారీ నిర్మాతలైనా కూడా లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థకు, రజనీ అభిమానులకు శంకర్‌ షాకుల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దర్శకుడైనా, అది తీసేది ఎంత క్రేజీ ప్రాజెక్ట్‌ అయినా రిలీజ్‌ డేట్‌ని చెప్పలేకపోవడం సరైన పద్దతి కాదు. దీనివల్ల మిగిలిన చిత్రాల నిర్మాతలకే కాదు.. ప్రేక్షకులకు కూడా విసుగొచ్చే ప్రమాదం ఉంది. 

ఇక ఎలాగోలా దీని టీజర్‌ని రిలీజ్‌ చేయాలని భావిస్తే అది సోషల్‌ మీడియాలో లీకై మరోసారి షాక్‌నిచ్చింది. దాంతో యూనిట్‌ అంతా డిజప్పాయింట్‌ అయింది. ఈ సమయంలో '2.ఓ' ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది రోబో చిట్టిని '2.ఓ'లో ఎలా ఉంటాడో చూపించేందుకు శంకర్‌ కొత్తగా మరో టీజర్‌ని రెడీ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఐపిఎల్‌ ఫీవర్‌లో ఉన్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రెడీ సెమీ ఫైనల్‌కి చేరింది. ఈ సమయంలో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదికగా, ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేయనున్నారని తెలుస్తోంది. 

నిజానికి ఎంతో ఖర్చుపెడితే గానీ రాని పబ్లిసిటీ ఐపిఎల్‌ ఫైనల్‌ వేదికగా వస్తే మాత్రం దేశవిదేశాలలోని క్రికెట్‌ అభిమానులందరి నోళ్లలో ఈ చిత్రం నాననుంది. అదే జరిగితే చిత్రానికి కావాల్సిన ప్రమోషన్‌ అద్భుతంగా ఉంటుందని అర్ధమవుతోంది. మరి చిట్టి రోబో ఐపీఎల్‌ ఫైనల్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...! 

2.0 Teaser Ready to Release:

2.0 Teaser Release in IPL Match

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ