Advertisementt

'కాలా' కి కష్టాలు తప్పడం లేదు!

Wed 23rd May 2018 02:52 PM
rajinikanth,kaala movie,dhanush,pa ranjith  'కాలా' కి కష్టాలు తప్పడం లేదు!
No Business to Kaala in Telugu 'కాలా' కి కష్టాలు తప్పడం లేదు!
Advertisement
Ads by CJ

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' రిలీజ్ కు దగ్గర పడుతున్న ఇంతవరకు తెలుగులో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఆడియో రిలీజ్ అయితే చేశారు కానీ ఆ పాటలు మార్కెట్ లో ఉన్నాయి అని కూడా ఎవరికి తెలియట్లేదు. జూన్ 7న రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కానీ ఆ వాతావరణం క్రియేట్ కాలేదు. దీనికి కారణం ధనుష్ చెప్పిన అధిక ధరకు తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే అని తెలుస్తోంది.

తెలుగులో రజిని సినిమాలకు ఇలా ఎప్పుడు జరగలేదు. 'లింగా' లాంటి డిజాస్టర్ సినిమాకు సైతం ఇక్కడ బిజినెస్ బాగానే జరిగింది. కానీ 'లింగా' తర్వాత వచ్చిన 'కబాలి' డిజాస్టర్ కావడంతో ఆ దెబ్బ 'కాలా' మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. మనవాళ్ళ భయానికి ప్రధాన కారణం ఇదే. అయితే కోలీవుడ్ లో టాక్ ఇంకోలా ఉంది. ధనుష్ కావాలనే ప్రొమోషన్స్ విషయంలో జాప్యం చేస్తున్నాడని అక్కడ వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు ట్రైలర్స్ డైరెక్టర్ రంజిత్ పా కట్ చేశాడంట. కానీ అవేవి హైప్ తెచ్చేలా లేవని వన్ మోర్ అంటూ ధనుష్ డైరెక్టర్ రంజిత్ పాని ఒత్తిడి చేస్తున్నాడట. అందుకే ప్రొమోషన్స్ లేట్ అవుతున్నాయి అని అక్కడ మీడియా టాక్.

మరోపక్క ఐపీఎల్ ఫైనల్ కు చెన్నై సూపర్ కింగ్స్ చేరుకుంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని '2.0' టీజర్ విడుదల చేసే ఆలోచనలో లైకా సంస్థ ఉన్నట్టు వచ్చిన వార్త ఇంకాస్త కలకలం రేపుతోంది. అసలు 'కాలా' సంగతి వదిలేసి సడన్ గా ఇంత అర్జెంట్ గా 2.0 టీజర్ ఎందుకు వదులుతున్నారు అని ఫ్యాన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. దీనినిబట్టి చూస్తుంటే తెలుగు కాలా జూన్ 7 న విడుదల అవ్వడం  కష్టమే అని తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ సేమ్ టైంకి రిలీజ్ కాకపోతే ఇక్కడ కొనాలనుకుంటున్న బయర్స్ కి పెద్ద ఎదురుదెబ్బ. చూద్దాం మరి ధనుష్ ఏం చేస్తాడో!

No Business to Kaala in Telugu:

Dhanush Pressure on Director PA Ranjith

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ