Advertisementt

'టాక్సీవాలా' కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది?

Wed 23rd May 2018 10:07 AM
vijay devarakonda,taxiwala,release date,june 14  'టాక్సీవాలా' కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది?
Taxiwala Release Date Confirmed 'టాక్సీవాలా' కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది?
Advertisement
Ads by CJ

అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే విజయ్‌ దేవరకొండకు 'అర్జున్‌రెడ్డి' తర్వాత నిజమైన తదుపరి చిత్రంగా రూపొందుతోన్న 'టాక్సీవాలా' చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో జాప్యం వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. వాయిదా పడిన విషయాన్ని చెప్పారు గానీ ఎప్పుడు వచ్చేది మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే జూన్‌ రెండో వారంలో విడుదల చేయనున్నామని చెప్పారు. బహుశా జూన్‌ 14న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కన చూసుకుంటూ దీనికి ఓ వారం ముందు 'కాలా', 'జురాసిక్‌ వరల్డ్‌.. ది ఫాలెన్‌ కింగ్‌డమ్‌' చిత్రాలు రానున్నాయి. ఆ సందడి ముగిసిన వారం తర్వాత టాక్సీవాలా ప్రేక్షుకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 

మరోవైపు ముందు వారం వచ్చే రెండు చిత్రాలు భారీ చిత్రాలే కావడంతో మరో వారం 'టాక్సీవాలా' పోస్ట్‌పోన్‌ అయినా ఆశ్చర్యం లేదు. ఇక జూన్‌ 14వ తేదీన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ 'సాక్ష్యం', ఇంద్రగంటి మోహనకృష్ణ-సుధీర్‌బాబుల 'సమ్మోహనం' వంటివి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వీటిల్లో 'టాక్సీవాలా' చిత్రం 14వ తేదీన వస్తే 'సమ్మోహనం' ఓ వారం పోస్ట్‌ పోన్‌ కావచ్చు. ఇక రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న 'టాక్సీవాలా'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఓ టాక్సీడ్రైవర్‌కి, ఓ దెయ్యానికి మధ్య నడిచే థ్రిల్లర్‌ మూవీగా ఇది రూపొందింది. ఈచిత్రంతో తన సత్తా చూపితే దేవరకొండకు ఇక తిరుగుండదనే చెప్పాలి. 

ఇక డిఫరెంట్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో ప్రియాంకా జువాల్కర్‌, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

Taxiwala Release Date Confirmed:

Vijay Devarakonda Taxiwala Release on June 14th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ