Advertisementt

రజినీ వల్ల కాలేదు, 'సంజీవని' అంట!!

Tue 22nd May 2018 05:07 PM
sanjeevani,rajinikanth,kochadaiyaan way,motion capture  రజినీ వల్ల కాలేదు, 'సంజీవని' అంట!!
Sanjeevani Film in Motion Capture Method రజినీ వల్ల కాలేదు, 'సంజీవని' అంట!!
Advertisement

ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం అంటే భారీ బడ్జెట్‌కి లోటు లేకుండా ఉంటుంది. ఆయనపై ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి వస్తుందనే వెసులుబాటు నిర్మాతలకు, దర్శకులకు ఉంటుంది. అలాంటిది రజనీకాంత్‌ హీరోగా అందునా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ని రప్పించి, మోషన్‌ క్యాప్షర్‌ విధానంగా 'కొచ్చాడయాన్‌'ని నిర్మించారు. కానీ ఇది ఎంత గొప్ప రజనీకాంత్‌ చిత్రమైనా కూడా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు ఏదో యానిమేషన్‌ ఫిల్మ్‌ కన్నా తక్కువ స్థాయిలో తీసిన చిత్రంగా నిరాశ పరిచింది. అలాంటిది ఇప్పుడు ఓ యంగ్‌ టీమ్‌ ఇదే మోషన్‌ క్యాప్చర్‌ విధానంతో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో కలిసి రెండేళ్ల పాటు శ్రమించి 'సంజీవని' అనే చిత్రం నిర్మించారు. 

ఇక ఈ చిత్రం ఆడియో వేడుక తాజాగా జరగగా, దీనికి హాజరైన రాజమౌళి తండ్రి, 'బాహుబలి, భజరంగీ భాయిజాన్‌, మెర్శల్‌, మణికర్ణిక'ల రచయిత విజయేంద్రప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు సంవత్సరాలు కష్టపడి ఈ యంగ్‌ బ్యాచ్‌ మంచి అవుట్‌పుట్‌ సాధించారు. టైటిల్‌గా 'సంజీవని' అని పెట్టడంలోనే వీరందరు అసలైన విజయం అందుకున్నారు. ఈ చిత్రం విజువల్స్‌ని చూశాను. అద్భుతంగా ఉన్నాయి అని కొనియాడారు. 

ఇక మనోజ్‌ చంద్ర, అనురాగ్‌ దేవ్‌, శ్వేత ముఖ్య తారలుగా రవివీడే దర్శకత్వంలో నివాస్‌ ఈచిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు రవివీడే మాట్లాడుతూ, ఫస్ట్‌ టైం ఇండియాలో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో పనిచేసి రెండేళ్లు కష్టపడి 'సంజీవని' చిత్రం తీశాం. తెలుగులో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వాడి భారీ గ్రాఫిక్స్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో భారీ గ్రాఫిక్స్‌ అందించాం. మా సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారని ఖచ్చితంగా చెప్పగలం. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. మరి ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని దర్శకుని మాటలను నిజం చేస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Sanjeevani Film in Motion Capture Method:

Sanjeevani in Rajini Kochadaiyaan Way

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement