Advertisementt

పెళ్లంటే కీర్తి ఏమందంటే..?

Tue 22nd May 2018 04:16 PM
  పెళ్లంటే కీర్తి ఏమందంటే..?
Keerthi Suresh About Marriage పెళ్లంటే కీర్తి ఏమందంటే..?
Advertisement
Ads by CJ

'మహానటి' తో బంపర్ హిట్ అందుకుని.. లేడి ఓరియెంటెడ్ చిత్రంతో సత్తా చాటిన కీర్తి సురేష్ ఇప్పుడు మంచి హ్యాపీ మూడ్ లో ఉంది. నిన్నటి వరకు కీర్తి సురేష్ ని ప్లాప్ హీరోయిన్ అనిన నోళ్లే ఇప్పుడు 'మహానటి' లో సావిత్రి పాత్రలో మెప్పించిన కీర్తి సురేష్ ని వెయ్యి నోళ్ళ పొగుడుతున్నారు. ఇక మహానటి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ 'మహానటి' సినిమా 'నడిగైయార్ తిలగం' పేరుతో విడుదలై హాట్ అయ్యింది. మరి ఇప్పటికే కోలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న కీర్తి సురేష్ ఇక 'నడిగైయార్ తిలగం' హిట్ అవడంతో ఇంకా టాప్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి 'నడిగైయార్ తిలగం' సక్సెస్  ఇంటర్వూస్ లో పాల్గొంటుంది. 

ఇప్పటి వరకు 'మహానటి' పబ్లిసిటీ కార్యక్రమాలతో బిజీగా వున్నా.. ఇక కోలీవుడ్ లో తాను విక్రమ్ తో చేస్తున్న 'సామి' సినిమా షూటింగ్ లో బిజీ అవుతానని.. అలాగే తనకి దర్శకత్వం మీద గాని, నిర్మతగా మారె విషయంలో గాని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని... అసలు తన తల్లి దగ్గర నుండి చెల్లి వరకు అందరూ సినిమాల్లోనే ఉన్నారని... తన తండ్రి ఒక నిర్మాత అని.. అయినా తనకు నటన మీదున్న ఆసక్తి మరే విషయంలోనూ లేదని..చెప్పింది. ఇక తనకు ప్రస్తుతం ప్రేమ లాంటివేం లేవని.. అప్పుడే పెళ్లి ఆలోచనలు ఎందుకని.. అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం కూడా లేదని చెప్పిన కీర్తి సురేష్ తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమేనని, భవిష్యత్తులో తాను ఎవరినైనా ప్రేమిస్తే, ఆ వెంటనే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలనని, వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. 

ఇక ప్రస్తుతం హరి దర్శకత్వంలో విక్రమ్ సరసన 'సామి 2' చేస్తున్న కీర్తి సురేష్... ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం 'సామి 2' షూటింగ్  'కారై కుడి'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ని యూరప్ లో ప్లాన్ చేశారు. యూరప్ షెడ్యూల్ లో విక్రమ్, కీర్తి ల మీద ఒక డ్యూయెట్ చిత్రకరించనున్నారు.

Keerthi Suresh About Marriage:

Keerthi Suresh Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ