Advertisementt

'నేలటిక్కెట్టు' నాగ్ స్టోరీనా..?

Tue 22nd May 2018 03:57 PM
kalyan krishna,nela ticket,nagarjuna,ravi teja  'నేలటిక్కెట్టు' నాగ్ స్టోరీనా..?
Nela Ticket Story for Nagarjuna? 'నేలటిక్కెట్టు' నాగ్ స్టోరీనా..?
Advertisement
Ads by CJ

అక్కినేని సినీ ఇనిస్టిట్యూట్ లో కోర్సు నేర్చుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. దాంతో నాగార్జున తన వర్క్ నచ్చడంతో వెంటనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌.

రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చినా కూడా అయినా మ‌రో సినిమా చేయ‌డానికి బాగా వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న మాస్ రాజా ర‌వితేజ‌తో చేసిన ‘నేల‌టికెట్‌’ వ‌చ్చేవారం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా సక్సెస్ తర్వాతే ఈ సినిమా కథ రాసా. ఈ కథ రాసుకునేటప్పుడే వేరే పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న. కానీ ఆ హీరోతో ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో ప‌క్క‌న పెట్టేశా. అనుకోకుండా ఓసారి ర‌వితేజ‌ని క‌లిసిన‌ప్పుడు క‌థ వినిపించా.. నిముషాల్లోనే ఆయ‌న క‌థ న‌చ్చి ఓకే చెప్పేశారు. 

రవితేజ ఇమేజ్ కి తగ్గట్టు ఈ కథలో చాలా మార్పులు చేశా. ఫస్ట్ కాపీ చూశాక ఈ సినిమాకు ర‌వితేజ‌యే కరెక్ట్ అనిపించింది అని కళ్యాణ్ కృష్ణ అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ..నాగ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అది క్యాన్సిల్ అయింది. ఆ కథే ఇప్పుడు రవితేజ చేశాడు. అయితే అప్పుడు నాగ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ కథ రవితేజ ఇమేజ్ కి సెట్ అవుతుందా? మరి ఈ సినిమాకు నాగ్ క‌రెక్టా! ర‌వితేజ క‌రెక్టా? అని తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే.

Nela Ticket Story for Nagarjuna?:

Kalyan Krishna Talks About Nela Ticket Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ