ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Srinu Vaitla Selected Flop Heroins For AAA

శ్రీనువైట్ల షాక్ ల మీద షాకులిస్తున్నాడుగా?

Srinu Vaitla Selected Flop Heroins For AAA

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యుయేల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే.. వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు శ్రీను. మొత్తానికి ఈ ఇద్దరి హీరోయిన్స్ ని ఒప్పించి షాక్ కి గురిచేశాడు. ఒకరు ఇలియానా.. మరొకరు శృతిహాస‌న్‌.

నటి ఇలియానా టాలీవుడ్ ని వదిలి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో రవితేజతో ‘దేవుడు చేసిన మ‌నుషులు’ సినిమాలో క‌నిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి ఇక్కడ హీరోలపై చాలా ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. అటు శృతిహాస‌న్ కూడా సినిమా ఒప్పుకుని ఏడాది పైనే అవుతోంది. టాలీవుడ్ లో ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న ‘కాట‌మ‌రాయుడు’ త‌ర్వాత మ‌ళ్లీ ఏ సినిమా ఒప్పుకోలేదు శృతి. ఈ ఇద్ద‌రినీ ప‌ట్టుకొచ్చి త‌న సినిమాలో అవ‌కాశ‌మిస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. 

ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభిన‌యం చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్ కావాలంట. అందుకే వీరిని సెలెక్ట్ చేశాడు శ్రీను. మరి అను ప్లేస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తాడో శ్రీను చూడాలి

Ileana And Shruti For Amar Akbar Antony

srinu vaitla
amar akbar antony
ileana
shruti haasan
raviteja