దోసె చాలెంజ్, ఐస్‌బకెట్ చాలెంజ్, మాన్వెకిన్ చాలెంజ్ అంటే ఫ్రీజ్ అయిపోయినట్లుగా నిలబడటం వంటి చాలెంజ్‌లు గతంలో పలు సోషల్ మీడియాలో చూశాం. ఇప్పుడు అదే కోవకి చెందినదే నో స్ట్రా చాలెంజ్. దీనిని 'లవ్లీ' ఫేమ్ శాన్వి 'నోస్ట్రాచాలెంజ్' వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. సాధారణంగా ఈ చాలెంజ్‌లలో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తే, కొన్ని మంచిపనుల కోసం కూడా వీటిని చేస్తూ ఉంటారు.
ఇక శాన్వి విసిరిన నో స్ట్రాచాలెంజ్ అంటే మనం సామాన్యంగా కూల్‌డ్రింక్స్, కొబ్బరిబోండాలు తాగేటప్పుడు స్ట్రాని వాడుతూ ఉంటాం. ఇవి ప్లాస్టిక్‌తో తయారవుతాయి. శాన్వికి ప్లాసిక్ అంటే కోపం. ఎందుకంటే ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందనేది నిజం. ఇదే విషయాన్ని శాన్వి చెబుతూ, నా ఫ్రెండ్‌తో కలిసి కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే స్ట్రా లేకుండా తాగు చూద్దాం అని ఆమె నన్ను చాలెంజ్ చేసింది. దాంతో స్ట్రా లేకుండా కొబ్బరి నీళ్లు కిందపడకుండా తాగడం అలవాటు చేసుకున్నాను. మొదటి రెండు మూడుసార్లు విఫలం అయ్యాను. ఆ తర్వాత కష్టపడి అలా తాగడం నేర్చుకున్నాను. దీనిని ఏదైనా మంచి పనికి ఉపయోగించుకోవచ్చు కదా అనిపించింది. వెంటనే ఈ వీడియోను పోస్ట్ చేశాను. దీనికి మంచి స్పందన లభిస్తోంది.
ప్లాస్టిక్ వినియోగానికి నేను బద్ద వ్యతిరేకిని. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్‌ని విసిరేసే వారిని కోపంతో తిడతాను కూడా. క్రమక్రమంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ఈ చాలెంజ్‌ని ప్రవేశపెట్టాను అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా శాన్వి చేస్తున్న చాలెంజ్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కే కాదు.. ఓ మంచిపనికి కూడా వాడుకోవచ్చనే చెప్పాలి.