Advertisementt

ఈ షో పై రభస జరుగుతోంది..!

Mon 21st May 2018 11:00 PM
arya,enga veetu,mapillai,controversy  ఈ షో పై రభస జరుగుతోంది..!
Is Arya's Enga Veetu Mapillai to be Banned? ఈ షో పై రభస జరుగుతోంది..!
Advertisement
Ads by CJ

తమిళ హీరో ఆర్యకి పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కావాలని, ఆయనను వివాహం చేసుకోవాలని భావించే అమ్మాలు ఫలానా వెబ్‌సైట్‌ ద్వారా ఎంట్రీలు ఇవ్వాలని గతంలో పిలుపు వచ్చింది. కానీ ఇదంతా కేవలం జస్ట్‌ పబ్లిసిటీ జిమిక్కు అని, తమిళంలో ప్రసారమవుతున్న టీవీ షో 'ఇంగవీటుమా పిళ్లై' అనే షోకి ప్రమోషన్స్‌ కోసం ఇలా చేస్తున్నారని అప్పుడే మీడియా తెలిపింది. ఇక ఆర్య, సంగీతలు హోస్ట్‌ చేసిన ఈ షో సీజన్‌1 ముగిసింది. ఈ షోలో విన్నర్‌గా నిలిచే అమ్మాయిని ఆర్య పెళ్లి చేసుకుంటాడని ప్రకటించారు. కానీ అదేమీ లేదని ఆర్య క్లారిటీ ఇచ్చాడు.  

కాగా ఈ షోలో ఆర్య అబర్నతి అనే అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. అయితే ఈ షో గురించి ఆ అమ్మాయి అబర్నతి మాట్లాడుతూ, ఆర్య నన్ను నవ్వించడానికే ఇలా చేశాడు. ఇది పూర్తిగా విభిన్నమైన అనుభూతి. ఈ అదృష్టం షోలో పాల్గొన్న మిగిలిన వారికి రాలేదు. నాకు మాత్రమే వచ్చింది. ఆర్య నన్ను ప్రత్యేకంగా చూడటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన ముందు నన్ను ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత నేను ముద్దు పెట్టాను. ఆ సమయంలో నేను ఎంతో నిరుత్సాహంగా ఉన్నాను. నన్ను మరలా యాక్టివ్‌ చేయడం ఎలాగో ఆర్యకి తెలుసు. ఆ కష్ట సమయంలోఆర్య నాకు అండగా నిలిచారు అని చెప్పుకొచ్చింది. 

ఈ షో పలు వివాదాలలో చిక్కుకుంది. ఈ షోని ఆపాలని ఓ వ్యక్తి కేసు కూడా పెట్టాడు. ఇది ఆడవారిని తప్పుగా చూపిస్తూ, యువతను చెడు మార్గంలో పయనించేలా చేస్తోందని, దీనికి ఆర్య, సంగీతలు ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వచ్చాయి. మరి ఇదే షోని రానా, లేదా విజయదేవరకొండలతో తెలుగులో చేస్తే బాగుంటుందేమో ...! 

Is Arya's Enga Veetu Mapillai to be Banned?:

Arya Enga Veetu Mapillai in Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ