నేడు ఆదివారం మే 20 నందమూరి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ రోజు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు కావడం ఇదే రోజు ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ తో పాటుగా టైటిల్ కూడా విడుదల చెయ్యడం నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పట్టలేని ఆనందాన్నిచ్చింది. కేవలం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు 'అరవింద సమేత వీర రాఘవ' మోషన్ పోస్టర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిర్రెక్కించే సంతోషాన్నిచ్చారు హారిక అండ్ హాసిని నిర్మాతలు. ఇక త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇలా ఎన్టీఆర్ విషెస్ అందుకుంటే... తన కొడుకు అభయ్ రామ్ నుండి తన పుట్టినరోజు మొదటి విషెస్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.
అలాగే ఇండస్ట్రీలోని ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర నుండి.. స్నేహితుల వరకు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు ఎన్టీఆర్ కి హ్యాపీ బర్త్ డే, జూనియర్ ఎన్టీఆర్... విష్ యు ఆల్ ది విక్టరీస్, లవ్ అండ్ ఎవిరీథింగ్ పాజిటివ్! అంటూ విషెస్ తెలియజెయ్యగా .. రామ్ చరణ్ అయితే ఎన్టీఆర్ తో కలిసి తాను దిగిన ఒక అద్భుతమైన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ... ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారు. అంతకుముందే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి ఫ్రెండ్స్. ఇక ఎన్టీఆర్ సినిమాలు చరణ్ చూసి అభినందించడం.. చరణ్ సినిమాలు ఎన్టీఆర్ చూసి అభినందించడం అలాగే.. చరణ్ పార్టీలకు ఎన్టీఆర్, ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివర్సరీకి చరణ్ వెళ్లడం వంటి విషయాలతో చరణ్ అండ్ ఎన్టీఆర్ లు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.
ఇక ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ ని హగ్ చేసుకుని ప్రేమతో గట్టిగా పట్టుకున్న ఆ పిక్ అటు మెగా, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక చరణ్ సోషల్ మీడియాలో ఆ ఫోటో ని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్ డే బ్రదర్!! హేవ్ వండర్ఫుల్ ఇయర్ ఎహెడ్. అంటూ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి ఆ పిక్ చూస్తుంటే అభిమానులకు కావాల్సింది ఇది కదా అనిపిస్తుంది కదూ.