Advertisementt

శర్వానంద్‌కి తమ్ముడు దొరికాడు!

Mon 21st May 2018 06:22 PM
sharwanand,sree vishnu,srikanth addala  శర్వానంద్‌కి తమ్ముడు దొరికాడు!
Sharwanand - Sri Vishnu combo soon శర్వానంద్‌కి తమ్ముడు దొరికాడు!
Advertisement
Ads by CJ

నేటి యంగ్‌ హీరోలలో నాని, శర్వానంద్‌ తర్వాత విజయ్‌దేవరకొండ, నారారోహిత్‌, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, నాగశౌర్య వంటి వారిని ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇక విషయానికి వస్తే ఒక సినిమా హిట్టయిందంటే ఆ దర్శకుడిని వెతుక్కుంటూ చిత్రాలు వస్తాయి. స్టార్‌ హీరోలు సైతం వారితో పని చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఓ స్టార్‌ హీరో ఎంతో నమ్మకంతో ఒక దర్శకునిగా అవకాశం ఇచ్చి అది డిజాస్టర్‌ అయినప్పుడు ఆ దర్శకుని పరిస్థితి అయోమయంలో పడిపోతుంది. 

'బ్రహ్మూెత్సవం' డిజాస్టర్‌తో శ్రీకాంత్‌ అడ్డాల ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన శర్వానంద్‌కి, అల్లుఅరవింద్‌కి ఓ కథ చెప్పి మెప్పించాడు. ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్‌ తమ్ముడి పాత్ర కోసం కూడా ఓ హీరోని శ్రీకాంత్‌ అడ్డాల ఒప్పించాడు. 'అప్పట్లో ఒకడుండే వాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్‌ మదిలో, నీది నాది ఒకే కథ' చిత్రాలలో మెప్పించిన శ్రీవిష్ణుని ఈ చిత్రంలో తీసుకున్నారని తెలుస్తోంది. శర్వానంద్‌, శ్రీవిష్ణులు ఇద్దరు టాలెంటెడ్‌ యంగ్‌ హీరోలు కావడం వల్ల వీరు అన్నదమ్ములుగా కరెక్ట్‌గా సూట్‌ అవుతారని భావిస్తున్నారు. 

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి త్వరలోనే గీతాఆర్ట్స్‌, శ్రీకాంత్‌ అడ్డాల నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. మరి ఈ చిత్రంతోనైనా శ్రీకాంత్‌ అడ్డాల మరలా తన పాత ఫామ్‌ని దొరకబుచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...! 

Sharwanand - Sri Vishnu combo soon:

Sharwanand and Sree Vishnu will next be seen in Srikanth Addala Film  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ