దర్శకుడిగా చాలా క్లిష్ట పరిస్థితిల్లో ఉన్న పూరి జగన్నాధ్ ఇప్పుడు నిర్మాతగానూ క్లిష్ట పరిస్థితుల్లోకి జారిపోయాడు. కొడుకు ఆకాష్ పూరి ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే మెహబూబా సినిమాని తానే దర్శకత్వం వహించి మరీ ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో దాదాపుగా 20 కోట్లు పెట్టుబడి పెట్టి మరీ నిర్మించాడు. కొడుకు ఆకాష్ పూరికి ఏ మాత్రం క్రేజ్ లేకపోయినా తన మీద నమ్మకంతో మెహబూబా సినిమాకి భారీ బిజినెస్ జరుగుతుందని... పూరి నమ్మకంతో అంత పెట్టుబడి దానికి ఎక్కించాడు. ఈ సినిమాకి ఛార్మి ఒక ఒంతు పెట్టుబడి పెడితే.. పూరి ఏకంగా రెండొంతుల పెట్టుబడి పెట్టాడు.
చివరికి మెహబూబాతో భారీగా పూరి అండ్ ఛార్మీలు నష్టపోయారు. ఆ లాస్ ఇలాంటి అలాంటి లాస్ కాదు. పూరి ఏకంగా తన ఆస్తులు అమ్మి మరి ఈ సినిమాకి పెట్టుబడి పెట్టానన్నాడు. అయితే మెహబూబా సినిమాకి పద్ధెనిమిది కోట్లు పెట్టుబడి పెట్టి.. రెండు కోట్లు పబ్లిసిటీ ఇతరత్రా ఖర్చులకు ఖర్చు పెట్టారు. మొత్తంగా 20 కోట్లు మెహబూబాకు ఖర్చు కాగా... ఈ చిత్రానికి శాటిలైట్, డిజిటల్ రైట్స్, థియేటర్స్ రైట్స్ కలుపుకుని మొత్తంగా చేతికి వచ్చేది ఎనిమిది కోట్లు మాత్రమే అని.. అసలు ఆ ఎనిమిది కోట్లు కూడా దాటదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా ఈ చిత్రంపై పన్నెండు కోట్లు నష్టం పూరి అండ్ ఛార్మికి తప్పదని... అంటున్నారు.
మరీ అలా 12 కోట్లు లాస్ అంటే ఛార్మికి ఒక వంతుకు గాను 4 కోట్లు, పూరికి రెండొంతులుగాను 8 కోట్లు లాస్ అన్నమాట. మరీ ఆస్తులు అమ్మేసి సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంది. తన మీద అతనకి నమ్మకం ఉండొచ్చు గాని. మరీ ఇంత నమ్మకం పనికిరాదంటూ పూరిపై సెటైర్స్ వేస్తున్నారు. మరీ ఇంత లాస్ నుండి త్వరగా కోలుకోవాలంటే.. పూరి మళ్ళీ ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలి. కానీ పూరి తో సినిమా చెయ్యడానికి ఏ హీరో సిద్ధంగా లేరు. ప్రస్తుతం పూరికి గడ్డుకాలమే. చూద్దాం పూరి తదుపరి హీరో ఎవరనేది?