కాజల్ అగర్వాల్. ఈ భామ ఎప్పుడో 15 ఏళ్ల కంటే ముందు కళ్యాణ్‌రామ్ సరసన 'లక్ష్మీకళ్యాణం' చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'చందమామ, మగధీర'లతో పాటు వరుసగా యంగ్ స్టార్స్ అందరితో కలిసి నటించింది. ఈమె తన 15ఏళ్ల కెరీర్ దాటి, 50 చిత్రాలకు పైగా చిత్రాలలో నటించినా కూడా ఇప్పటికీ యంగ్‌హీరోలు, స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూనే ఉంది. కిందటి ఏడాది ఆమె విజయ్ సరసన 'మెర్సల్', అజిత్ సరసన 'వివేగం'తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ, ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీనెంబర్ 150'లో, రానా హీరోగా తనను వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం చేసింది.
ఇక ఈమె ఇటీవల తన మొదటి హీరో కళ్యాణ్‌రామ్ సరసన 'ఎమ్మెల్యే' చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ 'క్వీన్'కి రీమేక్‌గా రూపొందుతున్న 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంతో పాటు యంగ్ హీరో శర్వానంద్ సరసన కూడా నటించేందుకు ఒప్పుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ ఇండస్ట్రీలో మనం నిలదొక్కుకోవాలంటే కాలంతో పాటు మనం కూడా మారాలి. నేను అందంగా ఉంటానని అందరు అంటూ ఉంటారు. దాని కోసం నేను తీవ్రంగా శ్రమిస్తాను. 15ఏళ్ల నుంచి నటిస్తున్నాను. ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. అదృష్టం లేకపోతే ఇదంతా జరగదు. నేను నా పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతో కష్టపడతాను. నాకు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఉత్తరాది అమ్మాయిగా భావించకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులు తమ భాషా అమ్మాయిగా భావిస్తుండటం నా అదృష్టం.
ఇంతవరకు సీనియర్స్‌తో నటించిన మీరు శర్వానంద్ వంటి యంగ్ హీరోతో నటించడం సమంజసమేనా? అని అడుగుతున్నారు. కాలానికి తగ్గట్టు మారితేనే మనం ఈ ఫీల్డ్‌లో నిలబడగలం. నేను అదే మార్గంలో పయనిస్తున్నాను. కథ, పాత్ర నచ్చితే ఏ హీరోతోనైనా నటించడానికి నేను సిద్దమే అని చెప్పుకొచ్చింది.