మన యంగ్‌స్టార్సే కాదు సీనియర్ స్టార్స్ కూడా ఇప్పుడు మేకోవర్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. సిక్స్‌ప్యాక్‌లు, చొక్కా లేకుండా తమ సిక్స్, ఎయిట్ ప్యాక్‌లను చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం మహేష్‌బాబు చాలా లేజీ అనే చెప్పాలి. ఏదో చిన్న చిన్నమార్పులను తప్ప ఆయన పెద్దగా మేకోవర్స్ చేయడు. ఏదో '1' (నేనొక్కడినే) చిత్రం కోసం సిక్స్‌ప్యాక్‌లో అది కూడా చొక్కా వేసుకుని కనిపించాడు.
ఇక ఈయన తాజా చిత్రం 'భరత్ అనే నేను' చిత్రం ఈయనకు బాగా బూస్ట్‌గా పనిచేసింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లోనే కాదు.. తెలంగాణ ఐటీమంత్రి ఫలానావి ధంగా తాను మారాలని కోరుకుంటున్నాను అని చెబితే, తన తదుపరి చిత్రంలో అలాంటి స్పెషల్ లుక్‌లోనే కనిపిస్తానని మహేష్ పేర్కొన్నాడు. సో ఎలాగైనా దిల్‌రాజు అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో మహేష్ కొత్త అవతారంతో కనిపించనున్నాడట. ఈయన 'భరత్ అనే నేను' చిత్రంలోని ఓ షాట్‌లో మీసాలతో కనిపిస్తే చూసి అభిమానులు ఆనందించారు. కేరింతలు కొట్టారు. ఇక రాబోయే చిత్రం మొత్తం మహేష్ పూర్తి మీసకట్టుతోనే కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో మహేష్ యూఎస్ వెళ్లి ఆ చిత్రం యూనిట్‌తో కలిసి తన 25వ చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ చిత్రం టైటిల్, చిత్రం ఏపాయింట్‌తో ఉంటుంది? దిల్‌రాజు, అశ్వనీదత్‌లంటే ఓ రేంజ్‌లో ఉండటం ఖాయమని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రానికి ఆల్‌రెడీ దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్‌ని కూడా రెడీ చేసిన విషయం తెలిసిందే.