15ఏళ్ల కెరీర్‌లో చార్మి సీనియర్ స్టార్స్, యంగ్‌స్టార్స్‌తో పాటు దాదాపు అందరి సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక లేడీ ఓరియంటెడ్ చిత్రాలైన 'మంత్ర, జ్యోతిలక్ష్మి'తో పాటు పలు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేసింది. ఇక కొన్నిచిత్రాలలో ఐటంసాంగ్స్ ద్వారా కూడా ఆమె మెప్పించింది. కానీ హీరోయిన్‌గా కెరీర్ ముగిసే సమయంలో ఎవ్వరు తీసుకోని నిర్ణయం తీసుకుని పూరీతో కలసి వ్యాపారం, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటోంది. తాజాగా పూరీ కుమరుడు ఆకాష్ హీరోగా వచ్చిన 'మెహబూబా' చిత్రంలో తాను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి 10కోట్ల వరకు నష్టాల పాలైంది.
ఇక ఈమె తన బర్త్‌డే సందర్భంగా తన అభిమానులతో ట్విట్టర్‌లో మాట్లాడింది. మీకళ్లు బాగుంటాయని ఒకరు అంటే థ్యాంక్స్ చెప్పింది. నిర్మాతగా నా ప్రయాణం అద్భుతంగా ఉంది. నాకు నచ్చిన ప్రదేశం మాల్దీవులు. పుట్టినరోజున 'మెహబూబా'ని ప్రచారం చేస్తూ గడుపుతాను...అని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఎంతోఅందంగా ఉన్నారు? అని అడిగితే ఇప్పటికింకా నా వయసు నిండా 30యేనని తెలిపింది. మీరు నాకు ముద్దు పెడతారా? అని ఓ అభిమాని అడిగితే నేను ముద్దుల విషయంలో ఎంతో పిసినారిని అని ఆమె స్పాంటేనియస్‌గా స్పందించింది.
నాకు కారంగా ఉండేది ఏదైనా ఇష్టమే. పూరీ పనిని ప్రేమిస్తారు. ఒత్తిడి నుంచి నా పప్పీలతో రిలాక్స్ అవుతాను.ప్రభాస్ నిజమైన డార్లింగ్. నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం. సినిమాలలో కనిపిస్తానో లేదో కొంతకాలం ఓపిక పట్టండి..అని చెప్పుకొచ్చింది!