Advertisementt

'రారా..కుమారా' నిజమేనా?

Sun 20th May 2018 03:01 PM
jr ntr,trivikram srinivas,movie title,raa raa rakumaraa  'రారా..కుమారా' నిజమేనా?
Is this NTR and Trivikram Movie Title? 'రారా..కుమారా' నిజమేనా?
Advertisement
Ads by CJ

ఎప్పటి నుంచో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రావాలని కోటి కళ్లతో ఎదురుచూశారు. చివరకు వారి కోరిక ఫలించింది. అయితే ఈ చిత్రం రూపొందుతున్న టైమింగ్‌ మాత్రం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ని నచ్చడంలేదు. 'అజ్ఞాతవాసి'తో ఎన్నడు ఎదుర్కోని విపరీతమైన విమర్శలను ఎదుర్కున్న నేపధ్యంలో తదుపరి చిత్రంగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రం రూపొందుతుంది. ఇక నిర్మాత రాధాకృష్ణ 'అజ్ఞాతవాసి' విషయంలో నష్టపోయిన బయ్యర్లకు కాస్త నష్టం పూడ్చాడు. అదే సమయంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రాన్ని కూడా పాత బయ్యర్లకు కాస్త తక్కువ రేటుకే ఇస్తున్నాడని తెలుస్తోంది. 

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ అంటే బాగా బిజినెస్‌ జరుగుతుంది. కానీ రాధాకృష్ణ మాత్రం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రంతో పాటు తాను మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు', శర్వానంద్‌-సుధీర్‌వర్మలను కలిపి ఓ ప్యాకేజీగా యూఎస్‌ బయ్యర్లకు అమ్మారట. ఈ డీల్‌ మొత్తం విలువ 18కోట్లు. ఇందులో 'ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌'ల చిత్రం వాటా 12కోట్లు అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మొదట 'అసామాన్యుడు' అనే టైటిల్‌ని వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తెచ్చారు. 

కానీ ఈ టైటిల్‌కి సరిగా స్పందన రాకపోవడంతో రూట్‌ మార్చి త్రివిక్రమ్‌ తనదైన శైలిలో 'రా..రా..కుమారా' అనే వెరైటీ టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం. ఇక రేపు అంటే మే20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ రోజు (19) ఎన్టీఆర్‌ లుక్‌తో కూడిన టైటిల్‌ని ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరింత స్లిమ్‌గా, ఫిట్నెస్‌తో కనిపిస్తున్నాడు. ఆయన మేకప్‌ కూడా డిఫరెంట్‌గా ఉండనుంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌, టైటిల్‌ని నిర్ణయించుకుని ఓ అంచనాకు రావాలంటే ఇంకాసేపు వెయిట్‌ చేయకతప్పదు...! 

Is this NTR and Trivikram Movie Title?:

Raa Raa Rakumaraa is the NTR Movie Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ