తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఆయన తీసిన 'బాహుబలి' సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని పలు మార్లు చెప్పారు. మహాభారతాన్ని సినిమా సిరీస్ గా తీయాలని తన కోరిక అని కాకపోతే ప్రస్తుతం తను అనుకున్న విధంగా టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే.. ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లడం లేదని చెప్పాడు జక్కన్న.
ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ తీసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్.. రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణికను తీస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే అది షూటింగ్ దశలో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్టార్ట్ చేసాడు. పర్వ అనే పేరుతో తన ప్రాజెక్ట్ వర్క్ చేసాడు క్రిష్. పర్వ అంటే అది కూడా మహాభారతమే.
భైరప్ప అనే కన్నడ రచయిత రాసిన మహాభారతమే ఈ పర్వ. ఎప్పటినుండో ఈ కథను సినిమాగా తీయాలన్నదే క్రిష్ కల అంట. అయితే ఈ పర్వలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి అని తెలుస్తుంది. ఐన క్రిష్ కాంప్రమైజ్ కాకుండా ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతను రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్ వేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు క్రిష్ దీని గురించి అఫీషియల్ గా నోరు విప్పిందే లేదు. మరి మణికర్ణిక సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా చెప్పుతాడేమో చూద్దాం.