Advertisementt

అఖిల్ 3 కి 'తొలిప్రేమ' సెంటిమెంట్..!!

Fri 18th May 2018 01:35 PM
akhil,venky atluri,tholiprema,sentiment,london  అఖిల్ 3 కి 'తొలిప్రేమ' సెంటిమెంట్..!!
Tholiprema Sentiment to Akhil 3rd Movie అఖిల్ 3 కి 'తొలిప్రేమ' సెంటిమెంట్..!!
Advertisement
Ads by CJ

వరసనే రెండు డిజాస్టర్స్ తో అక్కినేని అఖిల్ తన మూడవ సినిమా ఎవరితో ఉంటుందని తన ఫ్యాన్స్  ఎంతో ఆత్రుతగా ఎదురు చూసారు. అందరు అనుకున్నట్టుగానే అఖిల్ ఓ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. 'తొలిప్రేమ' సినిమాతో వరుణ్ తేజ్ లో ఇంకో యాంగిల్ ని చూపించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తన రెండో సినిమా అఖిల్ తో ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది విభిన్నమైన ప్రేమకథాంశంతో రూపొందనుంది. అఖిల్ కు జోడిగా సీఎం లవర్ అనుకున్నారు. అదేనండి మహేష్ బాబు 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానిని అనుకున్నారు. 

ఈ సినిమా మొదటి షెడ్యూలను ఈ నెల 29వ తేదీ నుంచి లండన్ లో ఆరంభించనున్నారు. కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా లండన్ లోనే జరగనుంది. ఆల్రెడీ టీం లండన్ లోని కొన్ని లొకేషన్స్ ను లాక్ చేసింది. త్వరలోనే అఖిల్ అండ్ కైరా అద్వాని అక్కడికి వెళ్లనున్నారు. 'తొలిప్రేమ' సినిమా కొంత భాగం షూటింగ్ లండన్ లోనే షూట్ చేసారు. ఆ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఇప్పుడు అదే సెంటిమెంట్ తో వెంకీ ఈ సినిమా షూటింగ్ అక్కడే షూట్ చేయనున్నారు. మరి సెంటిమెంట్ పరంగా చూసుకుంటే అఖిల్ సినిమా తొలిప్రేమలాగా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.

Tholiprema Sentiment to Akhil 3rd Movie:

Akhil 3rd Film Shoot in London

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ