Advertisementt

బాలయ్యతో చేసే మరో హీరో ఎవరు?

Fri 18th May 2018 01:31 AM
vv vinayak,balakrishna,hero,siva raj kumar,murali  బాలయ్యతో చేసే మరో హీరో ఎవరు?
One more Hero in Balayya and Vinayak movie బాలయ్యతో చేసే మరో హీరో ఎవరు?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ విషయం ఏమో గాని.. బాలకృష్ణ మాత్రం వి. వి. వినాయక్ తో ఒక కొత్త సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. అది కూడా ఒక రీమేక్ కథతో. కన్నడ సూపర్ హిట్ మూవీ మఫ్టీకి రీమేక్ కథతో బాలకృష్ణ - వినాయక్ కాంబోలో మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శకుడు వినాయక్ కూడా రిస్క్ లేకుండా మాస్ ని మెప్పించే ఈ రీమేక్ కథ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. మరి బాలకృష్ణ చాలాకాలం నుండి రీమేక్ సినిమాలు చేయడంలేదు. గతంలో సామీ సినిమా రీమేక్ లక్ష్మి నరసింహాలో నటించినప్పటి నుండి నేటి వరకు మళ్లీ పరభాషా రీమేక్ ల జోలికి వెళ్ళలేదు.

ఇక కన్నడ మఫ్టీ సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఆ సినిమాపై కన్నేశాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. కన్నడలో సీనియర్ హీరో శివ రాజ్ కుమార్ ఒక పాత్ర వేయగా మరో పాత్రలో యూత్ హీరో మురళి కనిపిస్తాడు. ఇక తెలుగులో బాలయ్య చేసేది శివ రాజ్ కుమార్ పాత్ర. మరి మురళి పాత్రలో కనిపించే సెకండ్ హీరో ఎవరు క్యూరియాసిటీతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక కన్నడ మఫ్టీలో హీరో మురళి పాత్రే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సేపు కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు మాత్రమే శివ రాజ్ కుమార్ పాత్ర ఎంట్రీ వస్తుంది. మరి బాలకృష్ణ సినిమాలో.. బాలయ్య లెట్ గా ఎంట్రీ ఇస్తే బాలయ్య ఫాన్స్ అస్సలూరుకోరు.

అందుకు తగ్గట్టుగానే బాలయ్య పాత్రను సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనబడే విధంగా వినాయక్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా రఫ్ గా మాస్ గా ఉంటుంది. మరి బాలయ్యతో సై అంటే సై అంటూ ఛాలెంజ్ చేసే పాత్రలో ఏ హీరోను తీసుకుంటారు అనే ఆసక్తి ప్రస్తుతము అందరిలో నెలకొంది. చూద్దాం బాలయ్యకి ఏ హీరో తగులుతాడో అనేది.

One more Hero in Balayya and Vinayak movie:

VV Vinayak New Movie With Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ